హోలీ పండుగ బాగా మారిపోయిందట: రకుల్

రంగుల పండుగ హోలీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా విపరీతమైన హంగామాతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. హోలీ సెలబ్రేషన్స్ ను ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు కానీ..  ఓ స్టేటస్ వచ్చాక వేడుకలు చేసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన హోలీ పండుగ మారిపోయిందంటూ చెబుతోంది.

‘ఈ సారి హోలీ రోజున నేను షూటింగ్ లో ఉంటాను. అందుకే మా కుటుంబం ఈసారి హోలీని చేసుకోవడం లేదు. ఈ పండుగను సెట్స్ జరుపుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను చిన్నపుడు హోలీని విపరీతంగా ఎంజాయ్ చేసేదాన్ని. ఏటికేడాది మరింత ఎక్కువ మురికిగాను రంగులతోను నిండిపోయేదాన్ని. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. హోలీ పండుగ రోజున మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది’ అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

‘ఇప్పుడు ఒంటికి.. జుట్టుకు రంగులు అంటితే.. అ మరకలు పోవడానికి రోజుల వ్యవధి అవసరం అవుతుంది. అందుకే సినిమాల్లో హోలీ వేడుకల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడైతే ఈ పండుగను ఎంజాయ్ చేయడం అంటే.. స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టేయడమే’ అని చెప్పింది రకుల్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *