మహేష్ సినిమాలో డాక్టర్ రకుల్ లుక్స్

మహేష్ బాబు-మురుదాస్ సినిమా సూపర్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసేసుకుంటోన్న సంగతి తెలిసిందే. మొదట్లో కాస్త మందకొడిగా సాగిన ఈ చిత్రం.. ఇప్పుడు మాత్రం మాంచి వేగం అందుకుంది. ఏప్రిల్ నెలాఖరుకల్లా ఈ స్పై థ్రిల్లర్ షూటింగ్ ను పూర్తి చేసే టార్గెట్ తో పని చేసేస్తున్నారు యూనిట్ అంతా.

ఇప్పటివరకూ ఈ చిత్రానికి టైటిల్ ఫైనల్ చేయకపోవడంతో.. ఇంకా ఫస్ట్ లుక్ ఇవ్వలేదు. స్పైడర్ అనే పేరు నిర్ణయించారని.. ఉగాదికి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేస్తారనే టాక్ మాత్రం ఉంది. అయితే.. ఈ చిత్రంలో మహేష్ ఎలా ఉంటాడనే విషయం కొన్ని లీక్డ్ పిక్చర్స్ ద్వారా జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ని కూడా.. లీకుల ద్వారానే తెలుసుకున్నారు అభిమానులు. మొదటి సారిగా ఈ పాత్ర పోషిస్తున్న రకుల్.. ఆ కేరక్టర్లో ఒదిగిపోయిందనే చెప్పాలి.

ఈ చిత్రంలో రకుల్ ఓ డాక్టర్ పాత్ర పోషిస్తున్న సంగతి ముందే చెప్పారు మురుగ టీం. సాధారణంగా మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద కేరక్టర్ ఉండదు. గజిని ఒక్కటే ఇందుకు మినహాయింపు. అయితే.. మహేష్ మూవీలో మాత్రం రకుల్ రోల్ కి చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందట. కేవలం పాటలకు మాత్రమే కాకుండా.. స్టోరీకి లింక్ అయ్యేలా రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *