నాన్న చెబితే సర్దుకుంటానన్న హీరోయిన్

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ విన్నర్.. ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. మెగా హీరో సాయిధరం తేజ్ తో కలిసి ఈ భామ నటించగా.. మెగా ఫ్యామిలీతో వరుసగా మూడో చిత్రం ఇది. సరైనోడు.. ధృవ.. ఇప్పుడు విన్నర్ అంటూ వచ్చేస్తోందీ బ్యూటీ.

ప్రమోషన్స్ లో భాగంగా తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్న రకుల్.. తనకు పొట్టి బట్టలు వేసుకోవడం అసలు ఇష్టం లేదని చెప్పింది. ‘ఇంట్లో ముఖ్యంగా మమ్మీ మిస్ ఇండియా అయేందుకు ప్రయత్నించమని సలహా. కానీ నాకు మరీ పొట్టి బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు. నాకు కొంచెం సిగ్గు ఎక్కువే. నాకు మా నాన్న బాగా సపోర్టివ్. ఇప్పుడు ఇలా సింగిల్ గా ఉండగలగుతున్నానంటే.. నాన్నకు నా మీద ఉన్న నమ్మకం. ఒకవేళ నేనేదైనా రాంగ్ స్టెప్ వేస్తే.. బ్యాగ్ సర్దేసుకుని వచ్చేయమంటే వెళ్లిపోతా. అది భయం కాదు.. ఆయన మీద గౌరవం’ అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

ఇక పెళ్లిపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది రకుల్. ‘నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే మాట్లాడ్డం కూడా నేర్చుకున్నా. అలాగే ఇక్కడే ఇల్లు కొనుక్కున్నా. నచ్చినవాడు ఎవరైనా దొరికితే.. ఇక్కడికే వచ్చి సెటిల్ అవమంటా’ అని చెప్పిన రకుల్ ప్రీత్.. ‘ఇప్పటివరకూ అలాంటివాళ్లె తగల్లేదు. అయినా నేనింకా చిన్నపిల్లనే’ అనేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *