అభిమానులకి రకుల్ స్వీట్ వార్నింగ్

టెక్నాలజీ పెరిగిపోయింది. అసలు విడుదల కాకుండానే ఆన్ లైన్లోకి సినిమాలు వచ్చేస్తున్నాయ్. ఇక థియేటర్లోకి బొమ్మ రాగానే మూవీ లింక్స్.. పైరసీ డీవీడీలు వెంటాడుతున్నాయ్. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త సమస్య తయారైంది. అదే స్క్రీన్ షాట్స్. మా హీరో చించేశాడు.. హీరో ఎంట్రీకి మేం చేసిన హంగామా చూస్తారా.. ఈ సీన్లో రొమాన్స్ అదుర్స్ అంటూ థియేటర్లో సీన్స్ వచ్చేటప్పుడు కేప్చర్ చేసి వాటికి సంబంధించిన  ఫోటోస్ షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ మధ్య ఇదో ఫ్యాషనైపోయింది.

లేటెస్ట్ రిలీజ్ ధృవకి కూడా ఈ సమస్య తప్పట్లే. థియేటర్స్ లో బుక్కైన సీట్స్ దగ్గర్నుంచి చెర్రీ ఇంట్రడక్షన్ అప్పుడు ఆడియెన్స్ రియాక్షన్.. హీరో- హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాన్స్.. ఇదే బెస్ట్ ప్రపోజల్ సీన్.. చెర్రీ బాడీ అదుర్స్ కదా అంటూ కొన్ని ఫోటోలు షేర్ అయిపోతున్నాయ్. ఫ్యాన్స్ కళ్లతో చూస్తే ఇలాంటివి సూపర్ అనిపించొచ్చు కానీ.. సినిమా యూనిట్ కి మాత్రం ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది. అసలే ఓ వైపు మూవీ పైరసీని ఎలా కట్టడి చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడీ ఫోటోల గోల.

అందుకే హద్దులు దాటేస్తోన్న అభిమానులకి రిక్వెస్ట్ లాంటి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. మీ అభిమానానికి థ్యాంక్స్ అంటూనే సినిమాకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం ఆపాలని కోరింది. ఇలా చేయడం వల్ల మా అందరి కష్టం వృథా అయిపోతుందని.. అర్థం చేసుకొండంటూ ఓ మెసేజ్ పెట్టింది. రకుల్ ఆవేదనలోనూ మీనింగ్ ఉంది కదా. బాగుందని పబ్లిసిటీ చేస్తున్నామనే భ్రమలో మన సినిమాని మనమే పైరేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు మెగాభిమానులు. మరీ ఇప్పుడైనా స్క్రీన్ షాట్స్ షేరింగ్ ఆగుతుందేమో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *