అఫీషియల్ః చిరు 150లో చరణ్

కొన్ని రోజులుగా నడుస్తున్న ఊహాగానాలు నిజమేనని తేలిపోయింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఐతే అతను సినిమాలో ఎలాంటి పాత్రా చేయట్లేదు. జస్ట్ ఒక పాటలో తళుక్కుమంటున్నాడంతే. ఆ సంగతి స్వయంగా రామ్ చరణే వెల్లడించాడు. ”నాన్న గారి సినిమాలో నాది గెస్ట్ రోల్ కాదు. ఒక పాటలో కనిపిస్తానంతే. నిన్ననే దానికి సంబంధించిన షూటింగ్ జరిగింది. ఒక బీజీఎంకు డ్యాన్స్ చేస్తాను. ఒక్క రోజులో నా అప్పీరియన్స్కు సంబంధించిన షూటింగ్ అయిపోయింది” అని చరణ్ వెల్లడించాడు.

ఇక ‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్ డేట్స్ కూడా చరణ్ వెల్లడించాడు. క్రిస్మస్ రోజు ‘ఖైదీ నెంబర్ 150’ ఆడియో వేడుక జరుగుతుందన్నాడు. విజయవాడలో ఈ ఫంక్షన్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. జనవరి 11 లేదా 12వ తేదీన సినిమా రిలీజవుతుందని.. ఇంకా ఫైనల్ డేట్ ఖరారు చేయలేదని వెల్లడించాడు. సినిమా షూటింగ్ ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉందన్నాడు. తన కొత్త సినిమా షూటింగ్ ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ తర్వాతే మొదలవుతుందని.. ‘ధృవ’ విడుదలయ్యాక పూర్తిగా తన తండ్రి సినిమా మీదే దృష్టిపెట్టబోతున్నానని.. ఈ సినిమాకు నిర్మాత కావడం తనకు పెద్ద బాధ్యత అని చరణ్ తెలిపాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *