రామ్ చరణ్ ఇంట్లో సందడి చేసిన ఎన్టీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మగధీర, బాహుబలి లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న తనం నుండి స్నేహితులైన చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో తొలిసారి కలిసి నటిస్తున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ `బావ‌` అని పిలుచుకుంటూ బ‌య‌ట కూడా సంద‌డి చేస్తుంటారు. ఈ స్టార్ హీరోలిద్ద‌రితో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా కూడా చేయ‌బోతున్న విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో చెర్రీ, తార‌క్ అన్న‌ద‌మ్ములుగా క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.
తాజాగా రామ్‌చ‌ర‌ణ్ ఇంట్లో జ‌రిగిన ప్రీ-క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు ఎన్టీయార్ కుటుంబంతో స‌హా హాజ‌ర‌య్యాడు. చెర్రీ భార్య ఉపాస‌న విస్తరాకుల‌తో క్రిస్మ‌స్ ట్రీని త‌యారు చేశారు. దీనిని చూడ‌డానికి శ‌ర్వానంద్‌, `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్ త‌దిత‌రులు హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఎన్టీయార్ ఫ్యామిలీ కూడా చెర్రీ ఇంటికి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటోల‌ను ఉపాస‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. `విస్త‌రాకుల‌తో ఈ క్రిస్మ‌స్ ట్రీని నేనే త‌యారు చేశా. మిస్ట‌ర్ `సి`తో ఉన్న వ్య‌క్తుల‌ను గుర్తుప‌ట్టారా?` అని ఉపాస‌న ట్వీట్ చేశారు
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *