బాలయ్యతో చిరంజీవికి పోలికే లేదు: వర్మ ట్వీట్స్‌

గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అన్ని వర్గాల వారు ఆ సినిమాను ప్రశంసనలతో ముంచెత్తారు. ఇప్పుడు అందులో రాం గోపాల్ వర్మ కూడా చేరిపోయాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో ‘ఖైదీ నెం.150’కి పోలికే లేదు అని వర్మ చేసిన ట్వీట్స్‌‌ కి మెగాస్టార్ అభిమానుల నుంచి ఎప్పటిలాగే గట్టి సమాధానమే వచ్చింది. అయితే, మెగాస్టార్ అభిమానులు తనపై విరుచుకుపడటాన్ని గమనించిన వర్మ వెంటనే ఇంకొన్ని ట్వీట్స్ చేశాడు. తాను కూడా మెగాస్టార్ అభిమానినే అని చెప్పారు. అందుకే మెగాస్టార్ ఎప్పుడూ బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *