రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోయి డాన్సు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే వర్మ ఈ సారి హీరోయిన్‌తో కలిసి రెచ్చిపోయి డాన్సులేస్తూ వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏ హీరోయిన్‌తో వర్మ అంతలా చిందులేశాడు? ఆ సందర్భం ఏంటి? వివరాల్లోకి పోతే..రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా `బ్యూటిఫుల్`. ”ట్రిబ్యూట్ టు రంగీలా” అనేది ట్యాగ్ లైన్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. చిత్రంలో సూరి హీరోగా నటించగా, నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. రవి శంకర్ సంగీతం అందించారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జనవరి 1వ తేదీన విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ జారీ అయింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు వర్మ. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి స్టేజిపై చిందులేశాడు      గోపాల్ వర్మ. రెచ్చిపోయి డాన్సులేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వర్మ స్టెప్పులపై కామెంట్లు చేస్తూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *