రామ్ చరణ్, శంకర్ ల చిత్రం ప్రారంభం, అదిరిపోయిన పోస్టర్

హీరో రామ్ చరణ్ (Ram Charan) “విశ్వంభర”:

శంకర్ (Shankar) దర్శకత్వం లో హీరో రామ్ చరణ్ (Ram Charan) హీరో గా దిల్ రాజు నిర్మించనున్న చిత్రం ప్రారంభమైంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి నటీనటులు,దర్శకుడు, నిర్మాత, సాంకేతిక నిపుణులతో కూడిన ఓ పోస్టర్‌(poster)ను విడుదల చేసారు. We Are Coming అంటూ హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా అందరు ఒకే తరహా సూటు బూటు కాస్టూమ్స్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసారు.

ఈ చిత్రం రామ్ చరణ్ కి 15 వ చిత్రం కాగా , శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ కి 50 వ చిత్రం. “విశ్వంభర” అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలిసింది. బడ్జెట్ గురించి లెక్క చేయని దర్శకుడు శంకర్, కానీ నిర్మాత దిల్రాజు ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ చిత్రం లో కియారా అధ్వాని హీరోయిన్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *