పరిటాల సునీతగా రమ్యకృష్ణ
‘బాహుబలి’ సినిమాలో రాజమాత శివగామిగా నటించి తన సత్తా మరోసారి రుజువు చేసుకుంది రమ్యకృష్ణ. ఆమె మరోసారి పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దివంగ టీడీపీ నేత పరిటాల రవి భార్య, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత పాత్రలో రమ్యకృష్ణ కనిపంచనున్నారు. అయితే ఆమె నటిస్తోంది బయోపిక్ కాదు. పరిటాల రవి జీవిత కథకు స్ఫూర్తిగా తీసుకొని రాసిన కల్పిత కథలో నటిస్తోంది. నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ బాలకృష్ణుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ దాదాపు పరిటాల రవి లైఫ్ స్టోరీని పోలి ఉంటుందని టాక్. పరిటాల రవి కిడ్నాప్, ఆ సమయంలో ఆయన భార్య సునీత పోరాటం తదితర అంశాల నేపథ్యం లో రానుందని తెలుస్తోంది. పరిటాల రవిని కిడ్నాప్ చేసిన వ్యక్తిగా నారా రోహిత్, ఆయన వైఫ్ సునీత పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి