రోహిత్-కోహ్లీ మధ్య విభేదాలపై …రవిశాస్త్రి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మా మధ్య విభేదాలు తారస్థాయికి చేరయని వార్తలు రవాడంపై టీమిండియా ప్రధాన కోచ్ రవి శాస్త్రి స్పందించారు. అసలు ఇద్దరి క్రికెటర్ల మధ్య కావాలనే రూమర్స్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నేను గత ఐదు సంవత్సరాలుగా వారిని చూస్తున్నాను. ఇప్పటి వరకు తను ఎవరి మధ్య విభేదాలు చూడలేదని అన్నారు. కుర్రాళ్ళు ఎలా ఆడతారో , ఒకరిని ఒకరు ఎలా ప్రొత్సహించుకుంటారో నేను చూశాను. టీమిండియా ఆటగాళ్లు ఎలా ఆడాలనే దానిపై మాత్రమే దృష్టి పెట్టడం నేను చూసా. అదే జరుగుతుంది. వారిద్దరి మధ్య విభేదాలు ఉంటే రోహిత్ ప్రపంచ కప్ లో ఎలా ఐదు శతకాలు కొట్టాడు? విరాట్ అతనికి ఎలా మద్దతిస్తాడు? ఇద్దరు కలసి భాగస్వామ్యాలు ఎలా చేశారు? అని ప్రశ్నించారు. ఇక కోహ్లి స్పందిస్తూ.. ‘ అటువంటి వార్తలు చదవడం కూడా కష్టంగానే ఉంది. కేవలం అసత్యాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. జరుగుతున్నా మంచిని మాత్రం చూడటం లేదు అని కరేబియన్ పర్యటనకు ముందు కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.

 

 

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *