‘రణరంగం’ వాదులుకున్న రవితేజ

శర్వానంద్ నటించిన రణరంగం సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. టీజర్‌, ట్రైలర్‌లు ప్రామిసింగ్‌గా ఉండటంతో సినిమా విజయంపై చిత్ర యూనిట్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.అయితే స్వాతంత్ర్యదినోత్సవ కారణంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా కథను ముందుగా రవితేజ కు వినిపించారట. రవితేజ కూడా రణరంగం చేసేందుకు ఓకే చెప్పారట. కానీ రణరంగం కథ గురించి తెలుసుకున్న శర్వానంద్‌ తాను హీరోగా నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారని, పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసి రణరంగం కథను తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. వరుస ఫ్లాప్‌లతో ఉన్న రవితేజ ఇలాంటి ఇంట్రస్టింగ్‌ సబ్జెక్ట్‌ను త్యాగం చేయటంపై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణీ ప్రియదర్శన్‌, కాజల్ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *