నోట్ల రద్దు ఆర్ బీఐకి ముందు రోజే చెప్పారు…

కొన్ని ప్రచారాలు జోరుగా సాగిపోతుంటాయి. ఇలాంటి ప్రచారాల్లో చెప్పే మాటలకు.. అధికారిక సమాచారానికి మధ్య అంతరం భారీగా ఉంటుంది. ఆ విషయాల్లో వ్యత్యాసాలు ఎంత ఎక్కువగా ఉంటాయన్నవిషయం తాజాగా వెలుగు చూసిన సమాచారం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నోట్ల రద్దు నిర్ణయాన్నిరిజర్వ్ బ్యాంకు కీలక అధికారులకు సైతం కొన్ని గంటల ముందే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

చాలా పరిమిత వ్యక్తులకు మాత్రమే నోట్ల రద్దు నిర్ణయం తెలుసని.. ఆర్ బీఐ అధికారులకు తాను తీసుకోనున్న నిర్ణయాన్ని చెప్పిన మోడీ.. కేంద్ర క్యాబినెట్ సహచరులకు తన నిర్ణయాన్ని వెల్లడించి.. వారిని అక్కడే ఉంచి.. దేశ ప్రజలకు తన సందేశాన్ని ప్రకటించారన్న ప్రచారం సాగింది. అయితే.. ఈ సమాచారం పూర్తిగా నిజం కాదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదిక చెబుతోంది.

పెద్దనోట్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఆర్ బీఐకి సూచించిన తర్వాత రోజే తాము ఓకే చెప్పినట్లుగా పేర్కొంది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబరు22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్ బీఐ ఈ వివరాల్ని వెల్లడించింది.

నవంబరు 7 – 2016న పాత నోట్లను రద్దు చేయాలన్న నిర్నయాన్ని కేంద్రం తమకు సూచించిందని.. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు.. తీవ్రవాదుల ఆర్థిక మూలాల్ని పెకలించేందుకు.. నల్లధనాన్ని వెలికితీసేందుకువీలుగా పెద్దనట్లను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు కేంద్రం ఆర్ బీఐకి తెలిపినట్లుగా పేర్కొంది.  గడిచిన ఐదేళ్ల కాలంలో నకిలీ రూ.వెయ్యి.. రూ.500నోట్లు చెలామణి ఎక్కువగా ఉండటంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని.. అందుకే రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్రం తమకు సమాచారం అందించిన రోజు వ్యవధిలోనే రద్దుకు తాము ఓకే అన్నట్లుగా నివేదికలో వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని చూస్తే.. రద్దు సందర్భంగా వచ్చి పడిన వార్తల్లో నిజాలు ఎన్న అంశం మీద కొత్త సందేహాలు పుట్టుకు రావటం ఖాయం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *