ఏటీఎంలు ఎందుకు రెడీ కాలేదంటే..!!

దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంల సంఖ్య  202801… మోడీ దెబ్బకు అన్నీ ఒక్కసారిగా బిజీగా మారిపోయాయి. నగదు ఇలా పెడితే చాలు అలా జనం లైన్లు కట్టి తీసుకెళ్లిపోతున్నారు. మళ్లీ నింపడానికి చాలా టైం పడుతోంది. అంతేకాదు.. 500 – 1000 నోట్లు రద్దు చేసిన తరువాత 2000 నోట్లు సరిపడా అందుబాటులోకి తేవడమే ఇంకా పూర్తిగా సాధ్యం కాలేదు. దీంతో 100 నోట్లే పెద్ద నోట్లయ్యాయి. దాంతో గరిష్ఠంగా 88.8 లక్షలు(అన్నీ వెయ్యి నోట్లయితే) పట్టే ఏటీఎంలో వంద నోట్లు కేవలం 8.8 లక్షలే పడుతున్నాయి. ఒక్కొక్కరికి 2 వేల లెక్కన 440 మందికే అవి సరిపోతున్నాయి. దీంతో జనం కష్టాలు తీరడం లేదు. 2000 నోట్లు అందుబాటులోకి వచ్చినా కూడా అవి ఏటీఎంలలో అడ్జస్టు కావడం లేదు. అంటే.. ఏటీఎంలను 2000 నోట్లకు సరిపడేలా మార్పులు చేయాలి. అందుకు ఎంత టైం పడుతుంది..? ఈజీ అనుకుంటున్నారా… అదేమంత ఈజీ కాదు. అందుకే ఈ ఇబ్బందులు. కారణమేంటో తెలుసా…?

ఏటీఎంల మరమ్మతులు – అడ్జస్టుమెంట్లు చేసే సంస్థలు దేశంలో ప్రధానంగా మూడే ఉన్నాయి. అవి.. ఎన్ సీఆర్ – డీబోల్డ్ – ఏజీఎస్. ఈ మూడు సంస్థలకు గట్టిగా 2 వేల మంది ఇంజినీర్లు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు 100 ఏటీఎంలు సరిచేయాలి. కొత్త నోట్లకు సరిపడేలా ఉన్న ఏటీఎంలను రెడీ చేయడానికి వాటి టెక్నాలజీ – అనుకోని అవాంతరాలను బట్టి కనీసం మూడు గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. యావరేజిన 4.5 గంటల టైం తీసుకున్నా ఒక్కొక్కరు 450 గంటలు పనిచేయాలి. అంటే రోజుకు 15 గంటలు లెక్కేసినా 30 రోజుల టైం కావాలి.

2 వేల నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి గట్టిగా మూడు రోజులైంది. అప్పటి నుంచి లెక్కేసినా ఇంకా కనీసం 27 రోజుల టైం పడుతుంది. అంటే దేశంలోని అన్ని ఏటీఎంలు అడ్జస్టు చేయాలంటే డిసెంబరు 17 వరకు టైం పడుతుంది. ఇది ఫుల్ టైం పనిచేసిన సందర్భంలో. ఇంకా సెలవులు – ఇతర అవాంతరాలు లెక్కేస్తే మరో వారం రోజులు అదనంగా కలుపుకోవాలి.  అంటే…. డిసెంబరు 25 వరకు ఏటీఎంలు సరిచేయడానికే టైం సరిపోతుందన్నమాట.

ఏటీఎంలన్నీ పక్కపక్కనే ఉండవు కాబట్టి నగరాలు – పట్టణాల్లో సమీప దూరాల్లో ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల మధ్య దూరం ఎక్కువే. అంటే ఏటీఎం నుంచి ఏటీఎంకు టెక్నిషియన్లు వెళ్లడానికి పట్టే సమయం సగటున 20 నిమిషాలు వేసుకున్నా 166 గంటల టైం ఏటీఎంలను చేరుకోవడానికే పడుతుంది. అంటే మరో వారం రోజులు. అంటే డిసెంబరు 25కి వారం రోజులు కలిపితే జనవరి 1… కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అప్పటికి మోడీ ఇచ్చిన పాత నోట్ల సబ్మిషన్ గడువు పూర్తవుతుంది. ఆలోగా దేశంలోని ఏటీఎంలన్నీ కొత్త నోట్లకి సరిపడేలా రెడీ కావు. కాబట్టి కొత్త సంవత్సరం వస్తే కానీ జనం కష్టాలు తీరవన్నమాట. సో… సుమారు రెండు నెలల వరకు మీ చుట్టూ ఉన్న ఏటీఎంల చుట్టూ తిరగడానికి రెడీగా ఉండాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *