మోక్ష‌జ్ఞ ఎంట్రీ లేట్ వెన‌క రీజ‌న్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై గ‌త యేడాది కాలంగా వార్త‌లు వ‌స్తోన్నా ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన క్లారిటీ మాత్రం లేదు. వాస్త‌వానికి ఈ ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య గతంలో ప్రకటించాడు. బాల‌య్య వందో సినిమా శాత‌క‌ర్ణిలో మోక్షుకు చిన్న రోల్ ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నా అలా జ‌ర‌గ‌లేదు.

ఇక ఈ యేడాది ఇప్ప‌టికే మోక్షు డెబ్యూ మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కాస్త ఆలస్యమవుతున్నట్టు సమాచారం. దానికి కారణం బాలయ్య మదిలో ఉన్న దర్శకులెవరూ ప్రస్తుతం ఖాళీగా లేకపోవడమే అని తెలుస్తోంది.

మోక్షజ్ఞ మొదటి సినిమాకు రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, బోయపాటి శ్రీను.. వీళ్లలో ఎవరో ఒకరిని డైరెక్టర్‌గా చేయాల‌ని బాల‌య్య అనుకున్నాడ‌ట‌. బాలయ్య కూడా కెరీర్‌ మొదట్లో బాపు, విశ్వనాథ్‌ వంటి దిగ్ధర్శకుల వద్ద పనిచేసి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు త‌న కుమారుడి డెబ్యూ మూవీ కోసం బాల‌య్య అనుకున్న డైరెక్ట‌ర్లు ఎవ్వ‌రూ ఖాళీగా లేక‌పోవ‌డంతో మోక్షజ్ఞ అరంగేట్రానికి కాస్త సమయం పడుతుందని టాక్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *