వాన పడింది…కానీ ఎరుపు రంగులో…

ఎరుపు రంగులో వర్షం కరువడంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నీటిని అధికారులు పరిశీలనకు తీసుకెళ్లారు. విషయానికి వస్తే నీలగిరి జిల్లా, కూడలూరు సమీపంలో నాడుకాని గ్రామం ఉంది. దీని సరిహద్దు ప్రాంతాలైన నాడుకాని, ముండా, కూవత్తిపొళిల్‌లలో సోమవారం రాత్రి గంటకు పైగా వర్షం కురిసింది. ఈ వర్షపు నీరు ఎరుపు రంగులో ఉండడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. కొందరు నీటిని పాత్రల్లో, బాటిల్స్‌లో సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చి స్థానికులు సేకరించిన నీటిని వింతగా తిలకించారు. ఈ నీటిలో తడిసిన చాలా మందికి ఒంటిపై దురదలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ అధికారులు ప్రజలు బాటిళ్లలో సేకరించిన నీటిని పరిశోధనల కోసం తీసుకెళ్లారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *