ఫ్రీ ఆఫర్‌పై రిలయన్స్ జియో కోర్టుకేం చెప్పిందంటే…

తమ వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న డేటా ఆఫర్లు పూర్తిగా చట్టబద్దమైనవని రిలయన్స్ జియో ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తమకు పూర్తి స్పష్టత నిచ్చిందని వెల్లడించింది. ట్రాయ్ టారిఫ్ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను రిలయన్స్ జియో యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

టారిఫ్ నిబంధనలను అతిక్రమిస్తున్న జియోను నియంత్రించడంలో ట్రాయ్ విఫలమైందని కూడా వొడాఫోన్ తన పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టలేదు. 21న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. కాగా ఇదే అంశంపై టెలికాం ప్రత్యేక న్యాయస్థానం టీడీఎస్ఏటీ ఈ నెల 20న విచారిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *