షాక్: ‘బ్రా ‘తీసేస్తేనే నీట్ పరీక్షకు అనుమతిచ్చారు

తిరువనంతపురం: జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు హజరయ్యే విద్యార్థుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీసింది. డ్రెస్ కోడ్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. కేరళ కన్నూర్ లోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వెళ్ళిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షలకు కూర్చొనే ముందే బ్రా తొలగించి రావాలని ఆదేశించారు.

ఒకవేళ బ్రా తొలగించకపోతే పరీక్షను రాయబోనివ్వమని హెచ్చరించారు. ఈ కొత్త రకం ఆంక్షల కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. ఈ నిబంధన విన్న విద్యార్థిని ఆశ్చర్యపోయింది.పరుగున బయటకు వచ్చేసింది. తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తల్లి ఆవేదనతో చెప్పారు. పరీక్ష అనంతరం ఆ విద్యార్థిని ఆగ్రహంతో ఊగిపోతూ ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది.

జీన్స్ కు మెటల్ బటన్ ఉండడంపై కూడ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా కూడ విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా చేదు అనుభవాలను ఎదురైనట్టు విద్యార్థులు చెప్పారు. పొడవు చేతుల చొక్కాలును వేసుకొస్తే కత్తిరించేశారు. హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ తీసేయాలని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *