హీరోయిన్ ప్రెగ్నెంట్.. రహస్యంగా పెళ్లి.

అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ తివారీలు ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారు బుధవారం ఎవ్వరికీ తెలియకుండా పుణెలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. రియా ఇప్పటికే ప్రెగ్నెంట్ అని, అందుకే వీరి వివాహం హడావుడి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. రియా.. తమిళంలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ‘తాజ్‌మహల్‌’ చిత్రంలో నటించింది. ఆమె సోదరి రైమా సేన్‌.. తెలుగులో నితిన్‌కి జోడీగా ‘ధైర్యం’ చిత్రంలో నటించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *