ఆర్ఆర్ఆర్ మూవి జూలై 30 న విడుద‌ల

టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న పీరియాడిక‌ల్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ మూవీ రూపొందుతుంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఒలీవియా,అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 30,2020న విడుద‌ల కానుంది. ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్‌గా న‌టిస్తున్న ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి గ‌ద్ధ‌ర్  ఈ సినిమాలో ఓ విప్ల‌వ గేయాన్ని రాసి పాడుతున్నారట‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *