ఆర్.ఆర్.ఆర్ చిత్రం 9 భాషల్లో, భాషల సూపర్ స్టార్స్ మాటలు
రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ ఇతర భాషల సూపర్ స్టార్స్ అందరిని ఒక్కొక్కరిగా లైన్ లో పెట్టుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. తెలుగులో ఆర్.ఆర్.ఆర్ కోసం సూపర్ స్టార్ మహేష్ ని రంగంలోకి దింపుతున్నాడనే న్యూస్ నడుస్తుంది. అలాగే హిందీ నుండి మెగా స్టార్ అమితాబ్ ని, తమిళం నుండి రజినీకాంత్ ని, మలయాళం నుండి మోహన్ లాలా ను ఆర్.ఆర్.ఆర్ కోసం రంగంలోకి దింపాలని ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట. అయితే వాళ్ళ చేత ప్రమోషన్స్ చేయించకుండా జస్ట్ ఆర్.ఆర్.ఆర్ కోసం వాయిస్ ఓవర్ చెప్పించాలని జక్కన చూస్తున్నాడట. తొమ్మిది భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కోసం తొమ్మిది భాషల సూపర్ స్టార్స్ ని తమ సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పించడానికి జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నాడట