ఆ దేశంలో భారత కరెన్సీ ఎక్స్చేంజ్ క్లోజ్!

పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం బ్లాక్ మనీని నిర్మూలించడమేమో కాని, చట్టబద్దమైన టెండర్లన్నీ నిలిపివేయబడుతున్నాయి. అమెరికాలోని బ్యాంకులు, భారత కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్లను మూతవేశాయి. అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద బ్యాంకులుగా పేరున్న జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కంపెనీ, సిటీగ్రూప్ ఇంక్ లు వర్తకులతో కలిసి పనిచేస్తూ క్లయింట్స్ కు రూపాయిలను అందిస్తుంటాయి. కానీ ఆ వర్తకుల దగ్గర బిల్స్ అందుబాటులో లేవని బ్యాంకుల అధికార ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సమయంలో రూపాయిలను సప్లై చేయలేమని వెల్స్ ఫార్గో అండ్ కో కూడా చెప్పేసింది. ఎక్స్చేంజ్ కోసం కరెన్సీని అంగీకరించమని బ్యాంకు ఆఫ్ అమెరికా కార్పొరేషన్ తేల్చేసింది.

ఒకవేళ క్లయింట్ల దగ్గర యూరోలు ఉంటే, బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని, కానీ భారత రూపాయి అయితే, మార్చుకోవడానికి ఎలాంటి బ్యాంకులు ఆఫర్ చేయడం లేదని తెలుస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలో భాగంగా నల్లధనం వెలికితీతకు, చట్టబద్ధం కాని ఆదాయాన్ని బయటకి రాబట్టడానికి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలామంది ప్రజలు ఈ నిర్ణయంతో ఇబ్బందులకు గురిఅవుతున్నారని, క్రెడిట్ కార్డు ఫ్రెండ్లీ కల్చర్ మనది కాదని, నగదు ఆధారిత ఎకానమీ మాత్రమేనని గ్రేట్ ఇండియన్ ట్రావెల్ కంపెనీ అధినేత నందిత చంద్రా తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *