సాహో తొలి రోజు…సెంచరీ…

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన సాహో తన సత్తా చూపిస్తోంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా సినీ విశ్లేషకులు వెల్లడించారు. డివైడ్ టాక్‌ వస్తున్న దానితో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్‌ సినిమాయే ఉండటం విశేషం. బాహుబలి 2 తో మొదటి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్‌ నెలకొల్పిన ప్రభాస్‌, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్‌ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది సాహో. మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *