చిరంజీవి ఆశీస్సులతో ప్రారంభమైన సాయిధరమ్‌తేజ్‌-వి.వి.వినాయక్‌ చిత్రం

మొత్తానికి కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తే నిజమవ్వబోతోంది. మెగాస్టార్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తన తర్వాతి సినిమాను మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబో్యే సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో సినిమా మొదలుపెట్టిన సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఓ కొత్త టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ‘దుర్గ’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, లావణ్య త్రిపాఠి కథానాయికగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.4గా సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం బుధవారం ఉదయం 9.27 గంటలకు ప్రారంభమైంది. మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అందించిన ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హీరో సాయిధరమ్‌తేజ్‌పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ నివ్వగా, మరో ప్రముఖ రచయిత సత్యానంద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన ఆకుల శివ ఫస్ట్‌ షాట్‌ని డైరెక్ట్‌ చేశారు. హీరో సాయిధరమ్‌ తేజ్‌ తల్లిగారైన శ్రీమతి విజయదుర్గ స్క్రిప్ట్‌ని అందించారు.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించే ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ఆకుల శివ, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, మేకప్‌: బాషా, కాస్ట్యూమ్స్‌: వాసు, స్టిల్స్‌: శ్రీను, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: జి.జి.కె.రాజు, సతీష్‌ కొప్పినీడి, కోడైరెక్టర్స్‌: సూర్యదేవర్‌ ప్రభాకర్‌ నాగ్‌, పుల్లారావు కొప్పినీడి, సహనిర్మాతలు: సి.వి.రావు, పత్స నాగరాజా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *