సుప్రీమ్ హీరో డేట్ కు వెళ్ళాడా!

గత రెండేళ్ళలో ఆరు డిజాస్టర్లతో బాగా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయిన సుప్రీమ్ హీరో తేజ్ ఐ లవ్ యు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చిత్రలహరితో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఎప్పుడు అడిగినా పెళ్లి మాటను దాటవేస్తూ తనకు పెళ్లి గురించి ఆలోచన లేదని డేటింగ్ కు ఎవరితోనూ వెళ్లలేదని బుకాయిస్తూ వచ్చిన తేజు ఇన్ డైరెక్ట్ గా దొరికిపోయినట్టు కనిపిస్తోంది. ఇటీవలే వచ్చిన తమన్నా నెక్స్ట్ ఏంటి మూవీ గుర్తుందా. అందులో సెకండ్ హీరొయిన్ గా నటించిన బ్రెజిలియన్ బ్యూటీ లారిస్సా బొనెసి మనకు అంతకు ముందే పరిచయం.

అలా అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కాని తేజుకి పీడకలలా మిగిలిన తిక్కలో పరిచయమయ్యింది ఈ బ్యూటీనే. అయితే అది ఫ్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఏంటి చేస్తే అదీ రిపీట్ రిజల్ట్ అందుకుంది. అయితే ముంబైలో ఉన్న లారిస్సా ఇటీవలే ట్విట్టర్ లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి పెట్టింది. తనతో డేట్ కోసం వచ్చినట్టుగా ఉన్న మొహం దాచుకున్న హీరో ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. మొహం దాచుకుని స్టిల్ ఇచ్చినా ఈజీగా ఎవరో అందరు గుర్తు పట్టేలా ఉండటంతో సీక్రెట్ బయట పడింది.

అయితే తనతో తేజుకి ఉన్నది జస్ట్ స్నేహమేనా లేక మరొకటా అనేది తెలియాల్సి ఉంది. అసలే సినిమాలు ఆడక తేజు బాగా ఇరిటేషన్ లో ఉన్నాడు. చిత్రలహరి హిట్ అయ్యే దాకా మళ్ళి మాములు అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో అదే పనిగా ముంబై దాకా వెళ్లి లారిస్సాను కలిసాడా లేక జస్ట్ ఫ్రెండ్ షిప్ స్కీంలో ఊరికే అలా కలిసి వచ్చాడా అనేది తేజునే చెప్పాలి.తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రలహరి ఏప్రిల్ 14న విడుదల కానుంది. దానికి ఇంకా చాలా టైం ఉంది కాని ఆ లోపు ఈ డేట్ గురించి తేజు ఓపెన్ అవుతాడేమో చూడాలి

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *