నానితో జోడీకి ప్రేమమ్ బ్యూటీ రెడీ

మలయాళ ప్రేమమ్ మూవీలో మలార్ పాత్రలో సాయి పల్లవి చేసిన మాయను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసేసేందుకు వరుణ్ తేజ్ తో కలిసి ఫిదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది ఈ మలయాళీ బ్యూటీ. తెలుగులో ఈ భామ నటించిన తొలి చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే.. ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ అమ్మడిని వరించిందని తెలుస్తోంది.

తాజాగా నేను లోకల్ తో భారీ హిట్ కొట్టేసిన నానితో చేసే ఛాన్స్.. సాయి పల్లవి దగ్గరకు చేరిందని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లోనే.. వేణు శ్రీరామ్ దర్శకుడిగా నాని ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నారట యూనిట్. స్క్రిప్ట్ విషయంలో కానీ.. తన రోల్ విషయంలో కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ కాని సాయి పల్లవి.. దర్శకుడు వేణు శ్రీరాం చెప్పిన నేరేషన్ కు ఫ్లాట్ అయిపోయిందట. అయితే.. డేట్స్ విషయంలో మాత్రం కొన్ని ఎడ్జస్ట్ మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఆ పని పూర్తయ్యాక అగ్రిమెంట్ సైన్ చేస్తానని చెప్పిందట.

తెలుగులో ఫిదా మూవీ చేస్తూనే.. తమిళ చిత్రం ఛార్లీ కోసం బల్క్ డేట్స్ కేటాయించింది సాయి పల్లవి. ఇప్పుడు నాని మూవీ కోసం ఈ డేట్స్ ఎడ్జస్ట్  చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. నాని మూవీ తప్పనిసరిగా చేస్తానని సాయిపల్లవి చెప్పిందట. కాల్షీట్స్ అడ్జస్ట్ చేసుకోవడం ఒకటే ఆలస్యం కాబట్టి.. దిల్ రాజు బ్యానర్ లో నాని హీరో వేణు శ్రీరాం డైరెక్షన్ లో రూపొందే మూవీకి సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *