‘సైరా’ టీజర్ రిలీజ్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ మరో టీజర్‌ను మంగళవారం ముంబైలో రిలీజ్ చేశారు. భారీ యాక్షన్‌ విజువల్స్‌ తో రూపొందించిన ఈ టీజర్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. పవన్‌ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో వావ్‌ అనిపించేలా డిజైన్‌ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *