లైవ్ లో సమంత.. చైతన్య ఏడ్చేశాడు

‘ఫేస్ బుక్’ లైవ్ ఛాట్ లో తొలిసారి పాల్గొంది స్టార్ హీరోయిన్ సమంత. వచ్చే సంవత్సరం ఏకంగా తనవి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెబుతూ.. అనేక విషయాలను తెలియజేసింది.

‘నా ఫెయిల్యూర్స్ నాకు చాలా లెసన్లే నేర్పించాయి. మంచి సినిమాలు కూడా ఫెయిలనప్పుడు కాస్త బాధగానే ఉంటుంది. కాకపోతే ఛాలెంజింగ్ అండ్ బెటర్ రోల్స్ వస్తాయనే అనుకుంటున్నాను” అంటోంది సమంత. ఇకపోతే తన యాక్టింగ్ గురించి వచ్చిన డిస్కషన్లో.. తెరి సినిమాలో సమంత చనిపోయే సీన్ గురించి ప్రస్తావించగా.. ”ఫ్రెండ్స్ అందరితోనూ కలసి తెరి సినిమాకు వెళ్ళాను. చైతన్య కూడా వచ్చాడు. ఆ సీన్ చూసిన తరువాత వీళ్లందరి ఫేసులు చూస్తే.. అందరూ ఏడుస్తున్నారు. చైతూ కూడా. అందరూ ఏడవాలనేంత రేంజులోనే పెర్ఫామెన్స్ చేశాను. నా యాక్టింగ్ పట్ల అప్పుడు సిసలైన సంతృప్తి వచ్చింది” అనేసింది జెస్సీ.

‘అసలు యాక్ర్టెస్ అవ్వడమంటేనే చాలా కష్టమైన క్లిష్టమైన విషయం. ఎందుకంటే ఎప్పుడూ మనం అందంగా కనిపించాలి. అందరూ మనల్ని జడ్జ్ చేస్తుంటారు. కాని నాకు మాత్రం కొన్ని గోల్స్ ఉన్నాయి. నేను ఈ ప్రొఫెషన్ ను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నానో.. దేన్ని పట్టించుకుంటానో దేన్ని పట్టించుకోనో నాకు తెలుసు. ఇది కష్టమైన ప్రొఫెషనే.. కాని నా ప్లాన్స్ నాకున్నాయి” అంటూ మొదలుపెట్టిన సమంత.. కొన్ని ప్రశ్నలకు ఇలా చెప్పింది.

హాయ్ అక్కినేని సమంత!!
నేనింకా అక్కినేని సమంత కాదండీ.. బట్.. థ్యాంక్యూ

కంగ్రాట్స్ ఫర్ నాగ చైతన్య…
హా హా హా

ఏ మాయ చేశావే లోనే చాలా బాగా చాశారే
నాకు అదే అర్దం కావట్లేదు. ఆ సినిమాలో అంత బాగా చేశానా? లేకపోతే ఆ సినిమా తరువాత అసలు మంచి పెర్ఫామెన్స్ చేయలేదా? నాకే అర్దం కావట్లేదు. ఎప్పటికైనా ‘ఏ మాయ చేశావే’ ను బీట్ చేస్తా.. (నవ్వేస్తూ)

మీ బ్యూటి సీక్రెట్ ఏంటి.. ప్రతీ సినిమాలోనూ అందంగా ఉంటారు..
బెటర్ మేకప్. గుడ్ సినిమాటోగ్రాఫ్. నమ్మండి ప్లీజ్. (ఫ్రాంక్ గా చెప్పింది)

మిమ్మల్ని హైదరాబాదులో మీటర్ దూరంలో చూశాం..
అవునా!? సారీ హాయ్ చెప్పలేదు నేను

డ్రీమ్ హీరో లేదా డైరక్టర్ లు?
మణిరత్నంతో పనిచేయాలని నా డ్రీమ్.. ఒక్కసారి మిస్సయ్యా.. మళ్ళీ వస్తే బాగుండు.

చరణ్ తో చేస్తారా?
నాక్కూడా తనతో వర్క్ చేయాలని ఉంది. ఛాన్స్ కోసం చూస్తున్నా.

ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో చేస్తారా?
అలాంటి సినిమాలే కావాలని అనుకోను. ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఆనందించే కథలను ఎంపిక చేసుకుంటా

మీ నేమ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది…
ఓహ్ నిజమా.. మా డాడ్ కు చెప్పాలా? మామ్ కు చెప్పాలా? ఫస్ట్ టైమ్ వింటున్నా ఈ కామెంట్.

ఫేవరేట్ హాలీవుడ్ డైరక్టర్…
ఉడీ ఆలెన్ అంటే చాలా ఇష్టం

ప్రత్యూష ఫౌండేషన్ గురించి…
ప్రత్యూష ఎప్పటికీ ఆగదు.. అలాగే కంటిన్యూ అవుతుంది. నా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దానికి సొంతంగా నిలబడే స్థాయి వచ్చేసింది.

ఎనీ ప్లాన్ టు ప్రొడ్యూస్ డైరక్ట్ మూవీ?
నెవర్ సే నెవర్. ఐ డోంట్ నో.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *