రూట్ మార్చిన సమంత.. అమ్మమ్మ గారి ఇంట్లో గెస్ట్‌గా..

అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత సమంత ఆచితూచి అడుగులేస్తున్నది. లీడ్ పాత్రలను నిరాకరిస్తూ గెస్ట్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. పెళ్లిని దృష్టిలో పెట్టుకొని సమంత కాస్తా రూట్ మార్చినట్టు తెలుస్తున్నది.

అతిథి పాత్రలే పరిమితం..

రాంచరణ్, సుకుమార్ చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం లభించినా పెళ్లి కారణంగా తప్పుకొన్నట్టు తెలిసింది. అంతేకాకుండా తమిళ చిత్రాల్లో మంచి ఆఫర్లు వచ్చినా నిరాకరిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న రాజుగారి గది2, సావిత్రి బయోపిక్ చిత్రంలో అతిథి పాత్రలేకే ఒకే చెప్పింది.

ప్రతీ సీన్ ఉద్వేగంతో..

రాజుగారి గదిలో పాత్ర చిన్నదైనా ప్రతీ సన్నివేశం ఉద్వేగంతో కూడినదనే మాట వినిపిస్తున్నది. సమంత నటించిన సీన్లన్నీ ప్రేక్షకులను కంటతడి పెట్టించే విధంగా ఉంటుందట. సమంత పాత్రను దర్శకుడు ఓంకార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు సమాచారం.

జమున పాత్రలో..

ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సావిత్రి బయోపిక్‌ అయిన మహానటి చిత్రంలో జమున పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది. ఆ పాత్ర కూడా కొద్దిసేపు ఉంటుందట. ఇప్పటి వరకు సమంత ఒప్పుకొన్న పాత్రలన్నీ తక్కువ నిడివి ఉన్న స్పెషల్ రోల్స్ మాత్రమే.

అమ్మమ్మ గారి ఇంట్లో గెస్ట్‌గా

యువ హీరో నాగశౌర్య చిత్రం అమ్మమ్మ గారి ఇల్లు అనే సినిమాలో అందులో కూడా సమంత అతిథి పాత్రను చేసేందుకు అంగీకరించిందట. కెరీర్ మంచి జోరు మీద ఉన్న సమయంలో సమంత గెస్ట్ పాత్రలకే పరిమితం కావడం ఆసక్తిని రేపుతున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *