‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’

‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.  దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం మేడారంలో జరిగే ఈ మహా జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి8న దేవతల వన ప్రవేశం ఉంటుంది .బెల్లం నైవేద్యం తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.అఖిల భారత దేశంలోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. “దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర”గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ మేడారం జాతర కోసం ఆర్టీసీ  నేరుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ బస్ స్టాండ్ ల నుండి బస్సులు ఏర్పాటుచేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *