రివ్యూ : ‘సరిలేరు నీకెవ్వ‌రు’ బొమ్మ దద్దరిల్లింది

సరిలేరు నీకెవ్వరు, మహేష్ బాబు సంక్రాంతి రిలీజ్ మూవీ, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో మాంచి మెసేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మహేష్ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమాని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్ ల్లో తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.  F2 చిత్రాన్ని పూర్తి కామెడీ సబ్జెక్టు తో మలిచి 100 కోట్లు వాసులు చేసాడు అనిల్. ఇక అనిల్ టాలెంట్ కి మహేష్ బాబు డైలోగ్స్ టైమింగ్ సెట్టైర్ తోడైతే ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. చాలా గ్యాప్ తరువాత లేడీ అమితాబ్ విజయ శాంతి నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. శుక్రవారాం అర్ధ రాత్రి నుంచే మహేష్ అభిమానులు థియేటర్ ల దగ్గర హంగామా చేశారు. మిడ్నైట్ షో లతో ముందుగానే సంక్రాంతి పండగ మొదలుపెట్టారు.

సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో మహేష్ బాబు పాత్రా అజయ్ కృష్ణ ఆర్మీ లో మేజర్ గా పనిచేస్తుంటాడు. విజయ శాంతి భారతి ఒక  ప్రొఫెసర్, తనకి దేశభక్తి ఎక్కువ, తన ఇద్దరు కొడుకులను ఆర్మీ లో జాయిన్ చేస్తుంది. ఆర్మీ లో చిన్న కొడుకు సత్యదేవ్ ఆక్సిడెంట్ కి గురవుతాడు, ఆ విషయాన్ని భారతికి తెలియజేయడానికి కర్నూల్ కి వస్తాడు అజయ్ మహేష్ బాబు. కర్నూల్ కి వచ్చిన అజయ్ కి హీరోయిన్ సంస్కృతి ఎలా పరిచయం అవుతింది, లోకల్ MLA నాగేంద్ర బాబు ప్రకాష్ రాజ్తో  ఎందుకు గొడవ పడాల్సి వస్తుంది, భారతి కి MLA కి ఉన్న గొడవలు ఏంటి, వాటిని హీరో ఎలా డీల్ చేసాడు అనేది సరిలేరు నీకెవ్వరూ సినిమా కథ.

 

ఇక మహేష్ బాబు పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే:

గత కొన్ని సినిమాలను చూస్తే ఎంటెర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన మహేష్ బాబు అభిమానులకు ఎక్కోడో ఒక మూలాన పోకిరి దూకుడు లాంటి పెర్ఫార్మన్స్ మిస్ అవుతున్నట్టు అనిపించింది. ఈ సినిమాతో ఆ లోటు తీరింది అని చెప్పొచ్చు. ఫుల్ టూ ఎనర్జీ తో మహేష్ క్యారెక్టర్ ని అనిల్ మలిచిన తీరు చాలా కొత్తగా ఉంది. 30 నిమిషాలు సాగే ట్రైన్ ఎపిసోడ్ అయితే సినిమా కి హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసి బయటికి వచ్చాక, ప్రతి ఒక్కరు కి గుర్తొచ్చే మాట, మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ డాన్స్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ టైం మహేష్ డాన్స్ పై ఫోకస్ చేసాడు అనిపిస్తుంది.  ఇక కొండా రెడ్డి బుర్జ్ దగ్గ ఇంటర్వెల్ బాంగ్ అదిరిపోయింది. క్లైమాక్స్ లో విజయశాంతి తో ఎమోషనల్ సీన్ లో మహేష్ పెర్ఫార్మన్స్ హైలైట్. మొత్తానికి మహేష్ ఫాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

 

ఇక దర్శకుడు అనిల్ రావిపూడి విషయానికి వస్తే:

ఇప్పటి వరకు అనిల్ పెద్ద హీరో తో మూవీ చేయలేదు. సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నప్పు ఉండే నెర్వేస్ అక్కడక్కడా సినిమాలో కనిపిస్తుంది. ట్రైన్ సీన్ కొంచెం లెంగ్త్ ఎక్కువ అనిపిస్తుంది. హీరోయిన్ రష్మిక మందన క్యారెక్టర్ కొన్ని  సన్నివేశాల్లో ఇర్రిటేషన్ తెప్పిస్తుంది. అందులో రష్మిక టాలెంట్ ని తక్కువ చేసినట్టు కాదు కానీ దర్శకుడు ఆ పాత్రని వ్రాసుకున్న విధానం అది. విజయ శాంతి గారు తనకున్న పరిధిలో చాలా బాగా చేశారు. విలన్ ప్రకాష్ రాజ్ MLA నాగేంద్ర బాబు గా అదరగొట్టాడు. ఇంట్రడక్షన్ లో అతి బయంకరుడుగా ఆతర్వాత కామెడీ గా రెండింటిని బాలన్స్ చేసాడు ప్రకాష్ రాజ్.  రాజేంద్ర ప్రసాద్ పాత్ర నిడివి ఇంకొంత ఉంటె బావుణ్ణు అనిపిస్తుంది.    ఇక మిగతా పాత్రలు సంగీత, రావు రమేష్, బండ్ల గణేష్ , సుబ్బా రాజు, వెన్నెల కిశోర్ లు ఆకట్టుకున్నారు.

 

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ విషయానికి వస్తే :

ఓన్లీ మ్యూజిక్ ని తీసుకుంటే దేవి డిస్సపాయింట్ చేసాడు అని చెప్పొచ్చు, కానీ విజువల్లీ బాగా తీయడంతో దేవి లోటు అంతగా కనపడలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు దేవి శ్రీ. రత్నవేల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఇంకొంచెం కష్టపడాల్సింది. రామ్ లక్ష్మణ్ ఆక్షన్ ఎపిసోడ్స్ బాగా డైరెక్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ కోరియో గ్రఫీ బాగుంది.

మోతంగా చూస్తే మహేష్ బాబు 26 వ చిత్రం సరిలేరు నీకెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు మంచి కమెండి అండ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సంక్రాంతి పండగకి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి ఎంజాయ్ చెయ్యొచ్చు. సంక్రాంతి పందెం కోడి సరిలేరు నీకెవ్వరూ మహేష్ బాబు అని చెప్పొచ్చుచేశారు.

ప్లస్‌ పాయింట్స్‌
మహేశ్‌బాబు యాక్టింగ్‌, కామెడీ
విజయశాంతి
పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
ఫస్టాప్
మైనస్‌ పాయింట్స్‌
కథ పెద్దగా లేకపోవడం
సెంకడాఫ్‌ లెంగ్తీగా ఉండటం
నటీనటుల: మహేశ్‌బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
దర్శక​త్వం: అనిల్‌ రావిపూడి
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు
రేటింగ్‌: 3/5
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *