అదృష్టవశాత్తు సైరాలో నటించేందుకు ఒప్పుకున్నారు: చిరంజీవి

అమితాబ్ బచ్చన్, చిరంజీవి కలిసి నటించిన సినిమా ‘సైరా’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది. ఇందులో చిరు గురువుగా బిగ్‌బి కనిపించనున్నారు.సోమవారం సైరా చిత్రం టీజర్‌ను ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ‘సైరా’ ప్రచారంలో భాగంగా చరణ్‌, చిరు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. అమితాబ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అమితాబ్‌ మా వద్ద విమానం టికెట్ల డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మేం కూడా బలవంతం చేయలేకపోయాం’ అని చరణ్‌ అన్నారు. అనంతరం చిరు మాట్లాడుతూ.. ‘అది నిజంగా గొప్ప విషయం. అమితాబ్‌ ప్రయాణించడం కోసం ప్రైవేటు జెట్‌ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ ఆయన దానికి కూడా ఒప్పుకోలేదు. ముంబయి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో బస చేయడం గురించి అడిగా. ‘నేను ఇదంతా స్నేహం కోసం చేస్తున్నా’ అన్నారు. చాలా సంవత్సరాలుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. అలా అదృష్టవశాత్తు మా సినిమాలో ఆయన నటించేందుకు ఒప్పుకున్నారు అని అన్నారు. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *