ఫ్లాప్ హీరోయిన్ కి భలే ఆఫర్.. పవన్ కళ్యాణ్ తో రొమాన్స్!

పవన్ కళ్యాణ్ మాంచి స్పీడ్ మీద ఉన్నాడు. కమిట్ అయిన సినిమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్ తో ముందు వెళ్తున్నాడు. ‘కాటమరాయడు’ ఎలాగైనా మార్చ్ లో విడుదల కావాలని అల్టిమేటం కూడా జారీ చేసాడు. దానికి తగ్గట్టే షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో చకచక కానిచ్చేస్తున్నారు. అజిత్ ‘వీరం’ రీమేక్ అనే టాక్ స్ట్రాంగ్ గా వినపడుతున్నా కాదు అనే మాట మాత్రం సినిమా యూనిట్ నుంచి రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో దాన్నే తీస్తున్నారు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. హీరొయిన్ గా శృతిహాసన్ నటిస్తున్న ఈ మూవీలో నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యగా పవన్ నటిస్తున్నాడు. లేట్ ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలా మిగిలిపోయిన ఓ ఫ్యాక్షనిస్ట్ రోల్ పవన్ కనిపిస్తాడు. అతన్ని కవ్వించే పాత్రే శృతిహాసన్ వేసింది. లిమిటెడ్ బడ్జెట్ లో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ‘ధృవ’కు ఫాలో అయిన స్ట్రాటజీ నే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ‘ఖైది నంబర్ 150’తో పాటు ‘కాటమరాయుడు’ టీజర్ విడుదల చేయబోతున్నారు.

ఇక ‘కాటమరాయుడు’ తర్వాత పవన్ మరో రీమేక్ ‘వేదాళం’ చేయనున్నట్టు తెలుస్తోంది. ముందు త్రివిక్రమ్ మూవీ అనుకున్నా అనివార్య కారణాల వల్ల అది కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అర్ టి నీసన్ దర్శకుడిగా వ్యవహరించే ఆ మూవీ కోసం హీరొయిన్ గా సాయేశా సైగల్ ఇప్పుడు పరిశీలనలో ఉంది. అమ్మడు ఆల్రెడీ తెలుగులో అఖిల్ తో సూపర్ డూపర్ ఫ్లాప్ ఒకటి తన ఖాతాలో వేసుకుంది. హిందిలో కూడా ఈ మధ్యే అజయ్ దేవగన్ తో చేసిన ‘శివాయ్’ కూడా అదే బాటలో నడవడంతో అమ్మడికి దిక్కు తోచడం లేదు. అందచందాలకు లోటు లేకపోయినా బాడ్ లక్ కూడా వెంట ఉండటంతో అవకాశాలు అనుకున్నంత రేంజ్ లో రావడం లేదు. ఇప్పుడు పవన్ సినిమా కోసం సాయేశా నేమ్ ని కన్సిడర్ చేయడం నిజమే అయితే పాప బూరెల బుట్టలో పడ్డట్టే. ఆ సినిమా కనక హిట్ అయితే మన తెలుగు నిర్మాతలు ఎలా వెంతపడతారో తెలిసిన విషయమే. అజ్ఞాతంలో ఉండే మాఫియా డాన్ గా అజిత్ ‘వేదాలం’ రీమేక్ పవన్ కు పర్ఫెక్ట్ ఛాయస్ అని ఫాన్స్ లో టాక్ ఉన్నా డైరెక్ట్ సబ్జెక్టు లో పవన్ ని చూడాలంటే మాత్రం త్రివిక్రమ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *