ఏటీఎంల్లో డ‌బ్బు తీయాల‌న్నా…వేయాల‌న్నా స‌ర్వీస్ చార్జ్ బాదుడే

ఏటీఎంల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌దు తీసుకోవాల‌న్నా…వేయాల‌న్నా చాలా సులువుగానే వేసేసేవారు…తీసుకునేవారు. ఇక‌పై ఆ రోజుల‌కు కాలం చెల్లింది. నగదును ఎటువంటి సర్వీస్ ఛార్జి లేకుండా తీసుకునే రోజులు పోయాయి. ఇక నుంచి ఐసీఐసీఐ – యాక్సిక్ – హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు నగదును విత్ డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీల మోత మోగనుంది.

ఈ మూడు బ్యాంకులు న‌గ‌దు తీయాల‌న్నా…వేయాల‌న్నా స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తెచ్చాయి. ఇకపై ఈ బ్యాంకుల్లో నెలకు నాలుగు సార్లు మాత్రమే ఫ్రీ ట్రాన్షాక్షన్స్‌కు ఈ బ్యాంకు ఖాతాదారులు అర్హులు. ఐదోసారి ఏటీఎంలో కార్డు పెడితే 150 రూపాయలు సర్వీస్ ఛార్జి రూపంలో క‌ట్ అవుతుంది.

మార్చి 1 నుంచే ఈ రూల్స్ అమ‌ల్లోకి వ‌చ్చేశాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు బ్యాంకులు చెబుతున్నాయి. క్యాష్ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఈ ఛార్జీలు వర్తిస్తాయి. గతంలో నెలకు నాలుగు సార్లు కంటే మించి నగదు విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఈ మూడు బ్యాంకులు 20 రూపాయలు సర్వీస్ ఛార్జి వసూలు చేసేవి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *