నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను..

హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తే మాట దాటి వేస్తారు. కానీ ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ కూతురు, బాలీవుడ్‌ కథానాయిక సోనం కపూర్‌ మాత్రం నిర్మోహమాటంగా వ్యక్తిగత విషయాన్ని అంగీకరించారు. తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు లైంగిక వేధింపుల బారిన పడ్డానని ఆమె తెలిపారు. ‘నా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయిన విషయం నాకు తెలుసు. ఇది నన్ను ఎంతో మానసిక వేదనకు గురిచేసింది’ అని సోనం పేర్కొన్నారు.

ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌.. 2016 సినిమాల్లో బలమైన మహిళా పాత్రలతో అలరించిన సోనం కపూర్‌, విద్యాబాలన్‌, అనుష్క శర్మ, రాధికా ఆప్తేలతో ప్రత్యేక షో నిర్వహించారు. ఈ షో ప్రోమో వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

ఈ చర్చా కార్యక్రమంలో తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి సోనం కపూర్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యాబాలన్‌ మాట్లాడుతూ ఇలా వేధింపుల బారినపడటం సోనం కపూర్‌ తప్పుకాదని, కానీ బాధితులదే తప్పన్నట్టుగా వ్యవహరించడమే సమస్యగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ‘మనం ఒక గాలిబుడగలో నివసిస్తున్నాం. మనం నిజమనుకున్నది నిజం కాదు’ అని అలియా భట్‌ స్పందించింది. గతంలో బాలీవుడ్‌ నటి కల్కీ కోచిన్‌ కూడా ఇలాగే తాను చిన్నప్పుడు లైంగిక వేధింపుల బారిన పడినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *