షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలకు కాసుల కొరత

షాదీ ముబారక్‌ పరిస్థితి హైదరాబాద్‌ జిల్లా పరిధిలో గతేడాదికి సంబంధించి 5100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఈ ఏడాది

9120  దరఖాస్తులు వచ్చి చేరాయి. మొత్తం 14220 దరఖాస్తులకు గాను 274 తిరస్కరణకు గురయ్యాయి.  మొత్తం మీద 10,049 దరఖాస్తులకు మంజూరు లభించగా, అందులో సుమారు 4237 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీకి పంపకుండా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో మూలుగుతున్నాయి. ట్రెజరీ పంపిన వాటిలో 54 రంగారెడి  జిల్లా పరిధిలో గతేడాది 1084 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ  ఏడాది కొత్తగా 1770 కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 243 తిరస్కరణకు గురయ్యాయి. 2161 దరఖాస్తులకు మంజూరు లభించింది. 986 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీ పంపకుండా పెండింగ్‌లో ఉండగా, కేవలం 1175 బిల్లులకు మాత్రమే నిధులు పీడీ ఖాతాలో డిపాజిట్‌ అయ్యాయి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  మొత్తం మీద 5758 బిల్లులకు మాత్రమే పీడీ అకౌంట్లలో డిపాజిట్‌ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కళ్యాణ లక్ష్మి  గతేడాది 355 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏదాడి ఇప్పటి వరకు కొత్తగా 923 దరఖాస్తులు వచ్చాయి. 30 తిరస్కరణకు గురయ్యాయి. 896 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 9 బిల్లులు ట్రెజరీకి పంపకుండా ఆర్డీవో వద్దనే ఉంచారు. ట్రెజరీ వద్ద 95 బిల్లులు పెండింగ్‌ ఉండగా, కేవలం 799 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జి  ల్లా పరిధిలో గతేడాది 381 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1202 దరఖాస్తులు వచ్చి చేరాయి. 33 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 1109 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 172 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ట్రెజరీ వద్ద 29 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, మొత్తం మీద 908 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది . హైదరాబాద్‌ జిల్లా పరిధిలో గతేడాదికి సంబంధించి 5100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *