బిగ్ బాస్ సీజన్ -3 లోకి శ్రద్ద దాస్

తెలుగు నాట అత్యంత ప్రజాధరణ పొందిన రియాల్టీ షోగా ప్రఖ్యాతి గాంచిన బిగ్‌బాస్‌ షో మూడో సీజన్‌ ప్రారంభమైంది. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. పదిహేను మంది సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ మొదలై 5 రోజులు అవుతుంది. ఇప్పటికె బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మొదలయ్యాయి. చూస్తువుంటే తొందరలోనే బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్టు సమాచారం.

మీడియా, ఫిల్మ్ ఇండస్త్రి లో ఒక వార్తా చక్కర్లు కొడుతుంది. అదేంటంటే తొందరలోనే హీరోయిన్ శ్రద్ద దాస్ బిగ్ బాస్ తెలుగు సీజన్-3 లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందని, ఇప్పటికే బిగ్ బాస్ -3 ఆర్గనైజర్స్  శ్రద్ద బాస్ ని కలిసినట్టు సమాచారం. బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేషన్ అయ్యాక శ్రద్ద వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందంటా. దీనికి శ్రద్ద అంగీకరించినట్టు, తన ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తునట్టు, కచ్చితంగా తానే బిగ్ బాస్-3 ట్రోఫీ గెలుస్తాననే నమ్మకంతో ఉందంటా. బిగ్ బాస్ -3 హాట్ బ్యూటీ లేకపోతే కిక్ లేదని, తను హౌస్ లోకి వచ్చాక ఇంకా గందరగోళం సృష్టించాలని యూనిట్ చూస్తున్నట్టు ఉంది.

చివరిగా శ్రద్ద హింది రీమేక్ ఆర్ యక్స్ 100 లో నటించింది. కానీ అనుకున్నంత విజయం సాధించలేదు. శ్రద్ద తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *