సైమా 2019 అవార్డు విన్నర్లు

దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌథ్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఖతార్‌లో జరుగుతున్న ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు సందడి చేశారు. ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు. వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, కీర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్‌ సుమ, హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. టాలీవుడ్ అవార్డ్ లతో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది.

ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)
ఉత్తమ నటుడు(క్రిటిక్) : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
ఊతమ నటి(క్రిటిక్) : సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా – ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ – రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ ఆర్ట్ దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *