సైమా 2017 అవార్డుల విజేత‌ల వివ‌రాలు

ద‌క్షిణాది తార‌లంతా ఒకే చోట చేరి సంద‌డి చేసే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ సైమా (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ ) వేడుక నిన్న సాయంత్రం అబుదాబిలో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలుగు, క‌న్న‌డ‌ భాష‌ల‌కి చెందిన సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యార‌ని తెలుస్తుండ‌గా, ఈ రోజు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కు సంబంధించిన సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో సైమా హంగామా జ‌ర‌గ‌నుంది. న‌టీమ‌ణుల గ్లామ‌ర్ తో , రాక్ ప‌ర్ఫార్మెన్స్ తో, సెల‌బ్రిటీల ఆట పాట‌ల‌తో సైమా వేడుక సంద‌డిగా జ‌రిగింది. అయితే నిన్న జ‌రిగిన సైమా వేడుక‌లో తెలుగు భాష‌కి సంబంధించిన న‌టీన‌టుల‌ని అవార్డుల‌తో స‌త్క‌రించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు అందుకోగా, ర‌కుల్ ప్రీత్ సింగ్ ని బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వ‌రించింది. ఇక బెస్ట్ చిత్రంగా పెళ్ళి చూపులుకి సైమాకి ఎంపికైంది. ముర‌ళీ మోహ‌న్ కి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో స‌త్క‌రించ‌గా, మోహ‌న్ బాబు సినీ ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్ధాలు పూర్తి చేసుకున్నందుకు గాను స్పెష‌ల్ అవార్డు అందించారు. ఇక మిగ‌తా విభాగాల‌లో అవార్డు అందుకున్న న‌టీన‌టుల వివ‌రాలు

సైమా 2017 అవార్డులు(తెలుగు)

– ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
– ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌(జనతా గ్యారేజ్‌)
– ఉత్తమ నటి: రకుల్‌ ప్రీత్‌సింగ్‌(నాన్నకు ప్రేమతో)
– ఉత్తమ నటుడు(క్రిటిక్‌): నాని
– ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (వూపిరి)
-ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లిచూపులు)
– ఉత్తమ తొలి చిత్ర నటుడు: రోషన్‌ (నిర్మలాకాన్వెంట్‌)
– ఉత్తమ తొలి చిత్ర నటి: నివేతా ధామస్‌(జెంటిల్‌మన్‌)
– ఉత్తమ సహాయనటుడు: శ్రీకాంత్‌(సరైనోడు)
– ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌(క్షణం)
– ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శన్‌ (పెళ్లిచూపులు)
– ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
– ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (జనతా గ్యారేజ్‌)
– ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్‌ (శైలజ శైలజ: నేను శైలజ)
– ఉత్తమ నేపథ్య గాయకురాలు: రమ్య బెహర( రంగదే: అ ఆ)
– ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (ప్రణామం: జనతా గ్యారేజ్‌)
– జీవిత సాఫల్య పురస్కారం: మురళీమోహన్‌
– తెలుగు చిత్ర పరిశ్రమలో 40 వసంతాలు పూర్తిచేసుకున్నందుకు స్పెషల్‌ అవార్డు: మోహన్‌బాబు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *