కూతురి వీడియోపై సింగర్ సునీత ఆగ్రహం

సెలబ్రెటీలకు సంబంధించిన హాట్ హాట్ వార్తలే చాలామందికి పెట్టుబడి. యూట్యూబ్ ఛానెల్ ఒకటి ఓపెన్ చేసి.. జనాల్ని ఆకర్షించే చీప్ హెడ్డింగ్ ఒకటి పెట్టి దానికి హిట్స్ కొట్టించుకోవడం.. ఆదాయం పొందండం.. ఇదీ కొందరు చేసే సులువైన వ్యాపారం. హెడ్డింగ్ చూసి ఏదో అనుకుంటాం కానీ.. లోపలికెళ్తే ఏమీ ఉండదు. సెలబ్రెటీల గురించి మరీ దిగజారి పోయి హెడ్డింగ్స్ పెట్టేస్తుంటారు వీళ్లు. ఐతే ఎవరి గురించి ఎలాంటి హెడ్డింగ్స్ పెడుతున్నామన్నది కూడా కొంచెం చూసుకోవాలి. టీనేజీలో ఉన్న సింగర్ సునీత కూతురి గురించి ఇలాగే చీప్ హెడ్డింగ్ పెట్టి సొమ్ము చేసుకోవాలని చూశారు ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు.

‘సింగర్ సునీత కూతురిని చూశారా.. కత్తి లాగా ఉంది’ అంటూ హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో షేర్ చేశారు. అందులో సునీత సోషల్ మీడియాలో వేర్వేరు సందర్భాల్లో పెట్టిన ఫొటోలనే షేర్ చేశారు. సునీతకు ఈ విషయం తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇంత చీప్ హెడ్డింగ్ పెడతారా అంటూ సదరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై మండిపడింది. వీళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కూడా అనుకున్నానని.. ఐతే ఇలా ఆన్ లైన్లో ఎంతమంది గురించి కంప్లైంట్ చేస్తామని ఊరుకున్నానని.. ఇలా చేయడం తప్పు అని ఆమె హితవు పలికింది. ఇలా తన కూతురి గురించి వ్యాఖ్యానించడానికి.. వీడియో పెట్టడానికి వాళ్లకు ఏం హక్కు ఉందని ప్రశ్నించింది సునీత. ఇది ముమ్మాటికీ తప్పే. ఒక టీనేజీ అమ్మాయి గురించి ఇలా హెడ్డింగ్ పెట్టి సొమ్ము చేసుకోవాలనుకోవడం దారుణం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *