కథలు వినడానికా? డ్రగ్స్ కోసమా..ప్రశ్నలతో పూరీ ఉక్కిరిబిక్కిరి

డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణకు హాజరయ్యేందుకు బుధవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన వెంట కొడుకు ఆకాశ్, తమ్ముడు సాయి శంకర్ వచ్చారు. సరిగ్గా పది గంటల సమయంలో పూరి ఎక్సైజ్ ఆఫీస్‌కు చేరుకున్నారు. సిట్ అధికారులు పూరీని ప్రశ్నించేందుకు వంద ప్రశ్నలు తయారు చేశారు.

పూరీ జగన్నాథ్‌పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయనను 20 ప్రశ్నలు అడిగారు. అనంతరం భోజనం చేసేందుకు విరామం ఇచ్చారు. ఇక్కడే భోజనం చేయాలని అధికారులు పూరీకి చెప్పారు. లంచ్‌కు ముందు ప్రశ్నించిన ఇరవై ప్రశ్నల్లో… పూరీ బ్యాంకాక్ పర్యటన, కెల్విన్‌తో పరిచయం తదితర ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. బ్యాంకాక్ పర్యటనలపై ఆరా తీశారు. బ్యాంకాక్ వెళ్లేది కథలు వినడానికా లేక డ్రగ్స్ కోణంలోనా అని అధికారులు అడిగారని తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్‌ను ప్రధానంగా బ్యాంకాక్ పర్యటనల గురించి ఆరా తీసినట్టు తెలుస్తున్నది. కథలు వినడానికా? కథలు తయారు చేసుకోవడానికి బ్యాంకాక్ వెళ్తారా లేక డ్రగ్స్ కోసమే అక్కడి వెళ్తారా అనే ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం

సాధారణంగా స్నేహితులందరూ కలిసి మందు పార్టీలు బయటనే చేసుకొంటారు. కానీ డ్రగ్ కేసులో చాలా వరకు పార్టీలు ఎక్కువగా కొందరి ఇంట్లోనే జరిగాయనేది అధికారులు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు ఫలానా వాళ్ల ఇంట్లోనే ఎందుకు చేసుకొంటారు అనే కోణంలో ప్రశ్నలు వేసినట్టు సమాచారం.

డ్రగ్స్ వ్యవహారంలో పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. పూరీ అండ్ కంపెనీ సభ్యుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, సుబ్బరాజు, తదితరలకు మీ నుంచే డ్రగ్స్‌, కొకైన్‌ వెళ్లింది నిజమా, కాదా? అనే పశ్నను అధికారులు అడిగినట్టు సమాచారం.

కెల్విన్‌తో సంబంధాల పైనే పూరీని అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారని తెలుస్తొంది. తొలి రౌండులోని 20 ప్రశ్నలకు పూరీ సమాధానం చెబుతుండగా.. మానసిక వైద్యుడు ఆయన తీరును గమనించారు. పూరీ 40 నిమిషాల పాటు తన వాదనలను వినిపించారని తెలుస్తోంది. కెల్విన్‌తో ఫోన్, వాట్సాప్ సందేశాల గురించి ప్రశ్నించారని సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *