నవదీప్ విచారణలో ఆసక్తికర నిజాలు? వారి పేర్లు బయటకు రాక తప్పదా?

హైదరాబాద్ డ్రగ్స్ ర్యాకెట్ కి సంబంధించి సిట్ అధికారులు సినిమా ఇండస్ట్రీలో నోటీసులు అందుకున్న వారిలో రోజుకో వ్యక్తిని విచారిస్తున్నారు. ఇప్పటికే కొంత మందిని విచారణ చేసి వారి నుంచి డ్రగ్స్ ర్యాకెట్ కి సంబంధించి కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. సోమవారం సిట్ విచారణకి హాజరైన నవదీప్ ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నవదీప్ చెప్పే విషయాలు కచ్చితంగా కీలకంగా మారే అవకాశం ఉందని కొందరు సిట్ అధికారులు అన్నట్లు తెలుస్తుంది. ఎ నేపధ్యంలో సిట్ విచారణలో హీరో నవదీప్ ఎం చెబుతాడు.

అధికారుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నాడు అనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇది వరకు ఓ సారి నవదీప్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరల ఇప్పుడు నేరుగా నోటీసులు అందుకొని విచారణకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ సారి మీద ఈ డ్రగ్స్ వ్యవహారం నవదీప్ విషయంలో అంత ఈజీగా సమసిపోయెట్లు లేదు . నవదీప్ నడుపుతున్న బార్ లో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మాకాలు జరుగుతున్నట్లు ఎక్శైజ్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. నవదీప్ విచారణలో మరి కొన్ని కీలక విషయాలు సిట్ అధికారులకి తెలిసే అవకాశం ఉందని అందరు అనుకుంటున్నారు. మరి ఈ విచారణలో ఇలాంటి నిజాలు తెలుస్తాయో అనేది వేచి చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *