శోభ‌న్‌బాబుకు జ‌య క్లోజ్ అయిన కార‌ణం ఇదే

తెలుగింటి సోగ్గాడు శోభన్‌బాబు, స్ఫుట్నిక్‌ స్టార్‌ జయలలిత కలిసి ఒకే ఒక్క సినిమాలో న‌టించారు.ఈ ఒక్క సినిమాతోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని, ఎఫైర్ ఉంద‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. ఈ ఒక్క సినిమాతోనే వీరిద్ద‌రు ఎందుకు ఇంత ద‌గ్గ‌ర‌య్యారు అన్న దాని వెన‌క ఆస‌క్తిక‌ర క‌థ‌నం ఉంది. జ‌య‌-శోభ‌న్‌బాబు జంట‌గా డాక్ట‌ర్ బాబు సినిమా వ‌చ్చింది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే జయలలిత తల్లి సంధ్య కన్నుమూశారు. తల్లి ఉన్నంత వరకు జయలలితకు అన్నీ ఆమే చూసుకునేవారు. ఆ తర్వాత ఆమె శోభనబాబులో తన తల్లిని చూసుకున్నారట. ఈ విష‌యాన్ని శోభ‌న్‌బాబు స్వ‌యంగా స్క్రీన్ ప్లే అనే సినీ మాస‌ప‌త్రిక‌లో నేను- నా క‌థానాయిక‌లు అనే శీర్షిక‌న రాసిన వ్యాసంలో రాసుకున్నారు.

ఈ సినిమా షూటింగ్‌లో జ‌య చెప్పలేనంత దిగులుతో నిండి బరువైపోయిన నా మనసును మీ జోక్స్‌తో తేలిక చేశారు. ప్రపంచం అంతా మళ్లీ నార్మల్‌గా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలనీ, అందరితోనూ కలిసిపోవాలనీ, నవ్వుకుని నవ్వించాలని, నవ్వించి నవ్వుకోవాలనీ, ఎప్పుడూ ఇలాగే తేలికైన మనసుతో తేలిపోవాలనీ, ఏమిటేమిటో, మొన్నటి వరకూ చాలనిపించిన ఈ బ్రతుకు నిన్నటి నుంచీ చాలదనిపిస్తున్నద‌ని జ‌య త‌న‌తో అన్న‌ట్టు ఆయ‌న ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

త‌న‌కు త‌న అన్న‌వారు ఉన్నా..వారికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే వారు న‌మ్మి డ‌బ్బు దోచుకుని వెళ్లిపోయార‌ని… ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మ.కూడదో తెలియదు. ఈ తెలియనితనాన్నీ, నా ఒంటరితనాన్నీ ఆసరాగా తీసుకుని మిగిలిన ఆస్తిపాస్తులు కూడా కాజేసి నన్ను బజారులో నిలబెడతారేమోనని దగ్గరకొస్తున్న ప్రతి వారి మీద అనుమానం క‌లుగుతోంద‌ని కూడా ఆమె త‌న‌తో అన్న‌ట్టు శోభ‌న్‌బాబు చెప్పారు.

త‌న‌కు ప‌క్క‌న త‌న అమ్మ ఉంటే ఎంత ధైర్య‌మో….మీరు ఉన్నంత సేపు కూడా అంతే ధైర్యం ఉంటోంద‌ని…మీరు వేసే ప్రతి జోక్‌కీ నా మనసెంత తేలికైపోతున్నదో, నేనెంత తేలిపోతున్నానో మీకు చెప్పలేన‌ని జ‌య త‌న‌తో అన్న‌ట్టు శోభ‌న్‌బాబు త‌న వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. ఈ మాట‌ల‌ను బ‌ట్టే జ‌య శోభ‌న్‌బాబుకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *