ఆ హీరోయిన్ పోస్ట్ చేసిన ఫొటోకు 2 లక్షల లైక్‌లు

సోషల్‌మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే హీరోయిన్లు అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, సెల్ఫీలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ కూడా ఫ్యాన్స్ కోసం ఓ సెల్ఫీ పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఆమెతో పాటు మరో అందాల భామ కూడా ఉండడంతో అభిమానులు ఫుల్ కుషీ అయిపోయారు.
సోనమ్‌తో పాటు బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ కూడా ఆ ఫొటోలో ఉండడంతో పోస్ట్ చేసిన పది గంటలకే రెండు లక్షల లైకులు వచ్చాయి. అనుష్కతో తాను తీసుకున్న సెల్ఫీని సోనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటో ఇప్పుడు బీటౌన్‌లో వైరల్ అవుతోంది. ‘ఆసమ్.. టుసమ్’ అంటూ అభిమానులు ఆ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *