మహేష్ బాబు ‘స్పైడర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది…

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’.తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయింది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌ కావడం, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కావడంతో సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది. విదేశాల్లో ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగుకు హాజరైన ఉమైర్ సంధు సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం…..

సమాజానికి చెడు చేస్తున్న దుష్టుల ఆటకట్టించడానికి హీరో ప్రయత్నించడం లాంటి కాన్సెప్టులు సౌత్ సినిమాల్లో కొత్తేమీ కాదు. ‘అకీరా’ లాంటి ప్లాప్ తర్వాత ఏఆర్.మురుగదాస్ ‘స్పైడర్’ సినిమా ద్వారా ఆల్మోస్ట్ సేఫ్ గేమ్ ఆడారు అని…. తెలిపారు.

కాన్సెప్టు కొత్తగాలేక పోయినా….. మురుగదాస్, అతడి టీం ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ అందించేందుకు ఎన్నో రేసి ఎలిమెంట్స్‌తో సినిమాను నడిపించారు…. అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.మహేష్ బాబు లాంటి పెద్ద హీరో ఉన్నప్పటికీ…. ‘స్పైడర్’ మూవీలో స్క్రిప్టే ఆయన్ను మించిన హీరోగా కనిపించింది. అర్థవంతంగా ఉంది. కొన్ని మసాలా సినిమా స్క్రిప్టుల్లో లాజిక్ సరిగా ఉండదు, కొన్నింటిల్లో అసలు ఉండదు…. స్పైడర్ సినిమా స్క్రిప్టు అలాంటి లోపాలు లేకుండా చాలా బావుందని తెలిపారు.

ఫస్టాఫ్ కొంచెం సాగదీసినట్లు అనిపించింది కానీ… సెకండాఫ్ ఫుల్ రేసీగా సాగింది…. అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.టాప్ టెక్నీషియన్స్…. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తమ బాధ్యత ఎంతో చక్కగా నిర్వర్తించారు. మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిష్ జైరాజ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్సయిందని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *