రివ్యూ : స్పైడర్

క‌థః శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని వారిని కాపాడ‌టంలో ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. ఆ ప్రకారం త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ప‌బ్లిక్ మాట్లాడే ప్రైవేట్ ఫోన్ల ద్వారా కొన్ని ప‌దాలు వినిపిస్తే త‌న‌కు అల‌ర్ట్ వ‌చ్చేలా రెండు సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకార‌మే కొంద‌రిని కాపాడుతుంటాడు. ఈ ప‌నిలో అత‌నికి మ‌రో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇత‌నికి సాయం చేయ‌బోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంది. దాంతో దానికి కార‌కులెవ‌ర‌నే విష‌యాన్ని ఆరాతీస్తాడు.
భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించిన విష‌యాలు అప్పుడే వెలుగులోకి వ‌స్తాయి. ఇత‌రుల ఏడుపు విని ఆనందాన్ని అనుభ‌వించే ఆ సోద‌రుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జ‌నాల ఏడుపులు విన‌డానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారా? హాస్పిట‌ల్‌లో ఉన్న పేషెంట్స్ ప్రాణాల‌తో భైర‌వుడు ఎలా ఆడుకున్నాడు. ఆ ఆట నుంచి జ‌నాల‌ను కాపాడ‌టానికి శివ‌కు చార్లీ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎలా సాయం చేసింది? ఇంత‌కూ శివ‌కు, చార్లీకి ప‌రిచ‌యం ఎలా జ‌రిగింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.
ప్లస్ పాయింట్స్: మ‌హేష్ న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన బ‌లం. అలాగే హరీష్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. ముఖ్యంగా విల‌న్‌, హీరో మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ప్రీ క్లైమాక్స్ సీన్‌లో విల‌న్‌ను ప‌ట్టుకునే సంద‌ర్భంలో రియాలిటీ షో లాంటి స‌న్నివేశం, రోల‌ర్ కోస్టర్ ఫైట్ సీన్ బావుంది. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించ‌న‌క్కర్లేదు. ప్రతీ స‌న్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు సంతోష్ శివ‌న్‌.
మైన‌స్ పాయింట్స్:
ఆర్‌.మురుగ‌దాస్ సినిమాల్లో బ‌ల‌మైన క‌థ, క‌థ‌నం ఉంటాయి. ఈ సినిమాలో అవి క‌న‌ప‌డ‌వు. ప్రేక్షకుల‌ను ఆస‌క్తితో క‌ట్టిప‌డేసే స‌న్నివేశాల‌ను అందంగా మ‌ల‌చ‌గ‌ల ద‌ర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో ఒక‌టి రెండు సన్నివేశాలు మిన‌హా ర‌క్తి క‌ట్టించ‌లేక‌పోయాయి. హీరోయిన్ ర‌కుల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌న‌ప‌డ‌వు. అలాగే పాట‌లు ఒక్కటి కూడా ఆక‌ట్టుకోదు.
రేటింగ్: 2.5/5
స‌మ‌ర్ప: ఠాగూర్ మ‌ధు
నిర్మాణ సంస్థలు: ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగ‌ణం: మ‌హేష్, ర‌కుల్ ప్రీత్‌, ఎస్‌.జె.సూర్య‌, భ‌ర‌త్ త‌దిత‌రులు
ఎడిటింగ్: శ్రీక‌ర్ ప్రసాద్‌
ఫైట్స్: పీట‌ర్ హెయిన్స్‌
సంగీతం: హేరిష్ జైరాజ్‌
సినిమాటోగ్రఫీః సంతోష్ శివ‌న్‌
నిర్మాతః ఎన్‌.వి. ప్రసాద్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *