శ్రీదేవి మరణం వెనుక కారణాలు ఇవేనా?

అసలు ఈ అందాల రాణి మరణం వెనుకాల ఎన్ని ట్విట్స్. అనూమానాలను నివృత్తి చేసుకునేందుకు దుబాయ్ పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు. దుబాయ్ లో అనూమాస్పద స్థితిలో చనిపొయిన శ్రీదేవి మృతిపైన గంటకు ఒక్క ట్వీస్ట్ వెలుగు చూస్తుంది. అంతేగాదు. అసలు విషయం ప్రక్కన పెట్టి కొసరు విషయాలన్ని కూడా బయటికి వస్తున్నాయి. శ్రీదేవి చనిపోయి 48గంటలు అయినప్పటికి కూడా దుబాయ్ పోలీసుల నుంచి ఒక్కమాట కూడా పెగలలేదు.

దీనికి తోడుగా అసలు సంఘటన ఎలా జరిగిందన్న మాట కూడా చెప్పలేదు. 48గంటల తరువాత ఒక్క డెత్ సర్టిఫికెట్ మాత్రమే బయటికి వచ్చింది. అది కూడా అందులో నాలుగు ముక్కలు వున్నాయి. ఇందులో కూడా అదుపు తప్పి బాత్ టబ్ లో శ్రీదేవి పడి చనిపోయిందని చెప్పారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. బోని కపూర్ చెప్పిన కథనం ప్రకారం. బోని కపూర్ మేనల్లుడి వివాహాం కొరకు శ్రీదేవితో పాటుగా ఖుషీలు కలిసి వెళ్లారు. నాలుగు రోజుల పాటుగా కొనసాగిన ఈ వేడుక తరువాత కూడా శ్రీదేవి అక్కడే వుండిపొయింది. బోని కపూర్ మాత్రం ముంబైకి తిరిగివచ్చాడు… అయితే శ్రీదేవికి సర్ప్రైజ్ చేయాలన్ని ఉద్దేశంతో బోని ఎవరికీ చెప్పకుండా దుబాయ్ కి వచ్చాడు. తన భార్య వున్న జూమైరా ఎమిరేట్స్‌ టవర్స్‌ హోటల్ కు వెళ్లాడు.

అప్పటికే శ్రీదేవి పడుకుని ఉండడంతో నిద్ర లేపలేదు బోనీ. రెండు గంటల తరువాత నిద్రలేచిన  శ్రీదేవి… తనముందు వున్న బోనిని చూసి ఒక్కసారి షాక్ గురైంది. ఇద్దరూ కలిసి ఇరువై నిమిషాల పాటుగా ముచ్చటించుకున్నారు. మనిద్దరం కలిసి డిన్నర్ చెద్దామని చెప్పాడు. అయితే తాను ప్రెష్ అప్ అయి వస్తానని శ్రీదేవి చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్లిందనేది కథనం.

అయితే ఇక్కడ ఒక్క చిన్నపాటు డౌట్.. శ్రీదేవి పుల్ గా మత్తులో వున్నట్లుయితే ఒకతే ఎలా వెళ్లగలిగింది. ఒకవేళ అంతా పుల్ అయివుంటే బెడ్ రూమ్ లోనే పడిపోవాల్సి వుంది. పదిహేను నిమిషాల వరకు బాత్ రూమ్ నుంచి ఎలా చప్పడురాలేదు. దీంతో అనూమానం వచ్చిన బోని వెంటనే బాత్ రూమ్ తలుపులను గట్టిగా కొట్టగా లోపలిని నుంచి ఎలాంటి సౌండ్ రాలేదు.

దీంతో అనూమానం వచ్చి తలుపును బద్దలు కొట్టి లొపలికి వెళ్లాడు. అప్పటికే శ్రీదేవి బాత్ టబ్ లో నిర్జీవంగా పడిపోయివుంది. బాత్ టబ్ లో పడిపొయిన వున్న శ్రీదేవిని చూసి బోని షాక్ కు గురయ్యాడు. శ్రీదేవిని లేపే ప్రయత్నం చేశాడు. వెంటనే వెయిటర్ కొరకు కాల్ చేశాడు. ఇదే సమయంలో తన ప్రెండ్ కు కాల్ చేశాడు. ముందుగా హోటల్ సర్వీస్ బాయ్ వచ్చాడు. అతను వచ్చిన వెంటనే హోటల్ లో వుండే డాక్టర్ కు కాల్ చేశాడు. ఇంతలో బోని ప్రెండ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. డాక్టర్ కూడా అక్కడి వచ్చాడు. ప్రాధమిక పరీక్షలు చేసి శ్రీదేవి చనిపొయిందని చెప్పాడు హోటల్ లో వుండే డాక్టర్.

ఇదిలా వుంటే ఆసుపత్రికి తీసుకుని పొదామని బోని చెప్పాడు. దీంతో వెంటనే హోటల్ కు అత్యంత్య సమీపంలో వున్న రషీద్ ఆసుపత్రికి తీసుకునిపోయారు. అక్కడ వైద్యులు కూడా శ్రీదేవి చనిపోయినట్లుగా చెప్పారు. తరువాత హోటల్ సిబ్బంది ఇండియన్ కాన్సులెట్ కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చేసరికి మూడుగంటల సమయం పట్టింది.

కాన్సులేట్ అధికారులు వచ్చిన తరువాత బుర్ దుబాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పడు పోలీసులు రంగప్రవేశం చేసి పొస్టుమార్టం కొరకు పంపించారు. శ్రీదేవి చనిపోయిన షాక్ నుంచి బోని తెరుకోలేదు. దీంతో అతను రషీద్ ఆసుపత్రి నుంచి నేరుగా హోటల్ కు వచ్చాడు. ఇరువై నాలుగు గంటలు గడిచిన తరువాత అక్కడి ఆసుపత్రిలో శ్రీదేవి మృతదేహాంకు పోస్టుమార్టం నిర్వహించారు.

చనిపోయిన వెంటనే వైద్యులు శ్రీదేవి శరీరం నుంచి రక్త నమునాలను సేకరించి పొరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు పంపారు. ఇరువై నాలుగు గంటల తరువాత పొరెన్సిక్స్ డిపార్ట్ మెంట్ నుంచి నివేదికలు వచ్చాయి. తాగిన మత్తులో శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోయి చనిపోయిందని నివేదికలు వచ్చాయి. దీనితో పాటుగా రక్తనమూనాల రిపోర్టును ఇరువై నాలుగు గంటల తరువాత గాని పోలీసుల చేతికి అందలేదు. అదే విధంగా ఎక్కగా కూడా హార్ట్ స్టోక్ వల్ల చనిపోయిందని చెప్పలేదు.

ఇదిలా వుంటే పోలీసులకు చాలా అనూమానాలు వున్నాయి.. ఈ నేపధ్యంలో బోనికపూర్ ను మూడున్నర గంటల పాటుగా విచారించారు పోలీసులు. అదే విధంగా హోటల్ సిబ్బంది, డాక్టర్, బోని ప్రెండ్ తో పాటుగా 18 మందిని పోలీసులు విచారించి స్టేట్ మెంట్ ను రికార్టు చేశారు.

శ్రీదేవి డెత్ మిసర్టీలో చాలా అనూమానాలున్నాయి. వీటిని నివృత్తి చేయడానికి పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు.

1. శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను విచారించిన దుబాయ్‌ పోలీసులు.
2. దేశం వదిలి వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు విధించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్.
3. శ్రీదేవి బస చేసిన హోటల్‌ సిబ్బందిని విచారించిన పోలీసులు.
4. బోనీ కపూర్‌, శ్రీదేవి కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు.
5. శ్రీదేవి మరణం ఎలా సంభవించింది? అనే విషయంలో మళ్లీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
6. కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయడంతో స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు.
7. వైద్యుల పోస్టుమార్టం నివేదికపై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది.
8. బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు ఎలా నిర్ధారించారో అర్థం కావడంలేదంటోంది.
9. గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో లేదు కాబట్టి ఎలా చనిపోయిందో నిర్థారణ కావాలంటున్నారు.
10. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు బోనీకపూర్‌ దుబాయ్‌లో ఉండాల్సిందేనని చెప్పిన పోలీసులు.
11. డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేసినప్పటికీ బాడీ అప్పగింతకు ఆలస్యం.
12. శ్రీదేవి మరణంపై ఉన్న అనుమానాలు, విచారణ కారణంగా భౌతికకాయం ఇండియాకు రావడం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
13. శ్రీదేవి బాడీలో ఆల్కాహాల్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు… అయితే అంత ఎక్కువగా ఆమే తాగిందా? బలవంతంగా తాగించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
15. ఆమె హోటల్‌ గది నుంచి 21, 22 తేదీల్లో అసలు బయటకు రాలేదు. ఎందుకు రాలేదు? ఇందుకు కారణాలేమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు.
16. పెళ్లి రిసెప్షన్‌ తరువాత బోనీకపూర్‌ ఇండియాకు వచ్చి మళ్లీ దుబాయ్‌కు వెళ్లాడు. ఎందుకలా?
17. శ్రీదేవి హోటల్‌ గది నుంచి బయటకు రాని రెండు రోజుల్లో ఏం జరిగింది?
18. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను దుబాయ్ పోలీసులు అన్వేషిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *