అతిలోక సుంద‌రిన‌ని మ‌ళ్లీ ఫ్రూవ్ చేసిందిగా

పాతికేళ్ల ప‌రువంలో మెరిసిపోవ‌టం మామూలే. న‌ల‌భైయేళ్లు వ‌చ్చేస‌రికి ఎంత అంద‌మైనా కాస్త పాత‌దైపోతుంది. కానీ.. 54 ఏళ్ల వ‌య‌సులో కూడా ఏమాత్రం చెద‌ర‌ని అందంతో.. ముఫ్పై ఏళ్ల భామ‌ల‌తో పోటీ ప‌డే స‌త్తా ఏ న‌టికైనా ఉందంటే అది క‌చ్ఛితంగా అతిలోక‌సుంద‌రి శ్రీదేవే అయి ఉంటుంది.

ఇద్ద‌రు కూతుళ్ల త‌ల్లి అయిన‌ప్ప‌టికీ.. వారితో పోటీ ప‌డ‌టం ఈ అతిలోక సుంద‌రికే సాధ్యం. వెండితెర వేల్పుగా.. అతిలోక సుంద‌ర‌న్న ట్యాగ్‌కు అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోవ‌టం శ్రీదేవికి మాత్ర‌మే సాధ్య‌మేమో? ఓప‌క్క కూతుళ్లు వెండితెర‌ను ఏలేందుకు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. ర్యాంప్ మీద మెరిసిన శ్రీదేవిని చూసినోళ్ల‌కు నోట మాట‌రాలేదంతే.

సింధూరం.. బంగారం మిక్స్ చేసిన ఫుల్ గౌన్ లో దేవ‌క‌న్య దిగి వ‌చ్చిందా? అన్న‌ట్లు ఉండ‌టం శ్రీదేవికి మాత్ర‌మే సాధ్య‌మేమో?  వ‌య‌సు మీద ప‌డుతున్నా.. ఎంత‌కూ త‌ర‌గ‌ని అందాలతో మెరిసిపోయింది. ర్యాంప్‌కే కొత్త క‌ళ‌ను తీసుకొచ్చింది. ర్యాంప్ మీద హోయ‌లు ఒలికించిన శ్రీదేవిని చూసిన అవాక్కు అయ్యార‌నే చెప్పాలి.

తాజాగా బెంగ‌ళూరులోని ఓ ప్ర‌ముఖ న‌గ‌ల వ్యాపార సంస్థ ఫ్యాష‌న్ షోను నిర్వ‌హించింది. అందులో సంప్ర‌దాయ వ‌స్త్రాలు.. న‌గ‌ల‌తో షో నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా శ్రీదేవి ర్యాంప్ వాక్ చేసి అద‌ర‌గొట్ట‌ట‌మే కాదు.. కెమేరా సైతం త‌న‌ను తాను ప‌ర‌వ‌శించిపోయేలా మెరిసిపోయింది. ప్ర‌తి జ‌న‌రేష‌న్ కు ఒక అందం ఉంటుంద‌ని. కానీ.. జ‌న‌రేష‌న్ ఏదైనా.. త‌న అందంతో పిధా చేసే స‌త్తా శ్రీదేవికి మాత్ర‌మే సాధ్య‌మేమో? అందగ‌త్తెలందు శ్రీదేవి వేర‌యా అనుకోక త‌ప్ప‌దు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *