రివ్యూ: శ్రీనివాస కల్యాణం : సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త

కథ:

తన జాయింట్ ఫ్యామిలీకి దూరంగా చండీఘడ్ లో జాబ్ చేస్తుంటాడు శ్రీనివాస్ (నితిన్). అక్కడే ‘కాఫీ డే’లో జాబ్ చేస్తూ మిడిల్ క్లాస్ అమ్మాయిగా శ్రీదేవి (రాశి ఖన్నా) కనిపించడం, కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మద్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో శ్రీ (రాశి ఖన్నా) పెద్ద బిజినెస్ మెన్ అండ్ మల్టీ మిలినియర్ అయిన ప్రకాష్ రాజ్ కూతురు అని తెలుస్తుంది. లైఫ్ లో టైంకి, బిజినెస్ కి తప్ప దేనికి వాల్యూ ఇవ్వని ఆయన్ని, వాసు శ్రీ తో తన పెళ్ళికి ఏలా ఒప్పించాడు ? ఆ ఒప్పుకున్నే క్రమంలో శ్రీ తండ్రి (ప్రకాష్ రాజ్) వాస్ కు ఓ షరతు పెడుతూ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు.

అసలు శ్రీదేవి తండ్రికి వాస్ కు మధ్య జరిగిన ఆ అగ్రిమెంట్ ఏమిటి ? ఆ కారణంగా వచ్చిన సమస్యలు ఏమిటి ? అసలు వాసు, శ్రీ పెళ్లి జరిగిందా ? జరిగితే వారి పెళ్లి ఎలా జరిగింది ? వాసు తన ఫామిలీ కోరుకున్న విధముగా పెళ్లి చేసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే.

కథనం – విశ్లేషణ:

ఉరుకులు పరుగుల జీవితాల్లో పడి మానవ సంబంధాల గురించి.. మన మూలాలు.. సంప్రదాయాల గురించి మరిచిపోతున్న వైనాల్ని గుర్తు చేస్తూ.. సినిమా ద్వారా ఒక కదలిక తెచ్చే ప్రయత్నం గత కొన్నేళ్ల నుంచి తరచుగా జరుగుతోంది. ఈ కోవలో వచ్చిన కొన్ని ‘మంచి’ సినిమాలు చక్కటి విజయం సాధించాయి. కానీ ఇలాంటి విషయాల్ని వినోదపు పూతతో చెప్పాలి. భావోద్వేగాలు సరిగా పండేలా చూసుకోవాలి. నాటకీయత ఎక్కువైపోకుండా చూసుకోవాలి. ప్రేక్షకులకు ఏదో మంచి చెప్పాలనే ఉద్దేశంతో మరీ హద్దులు దాటిపోకూడదు. ఈ విషయాల్లో తేడా వస్తేఏమవుతుందో చెప్పడానికి సరైన ఉదాహరణ ‘బ్రహ్మోత్సవం’. ‘శ్రీనివాస కళ్యాణం’ దాంతో పోల్చ దగ్గ సినిమా కాదు కానీ.. దాని ఛాయలు మాత్రం ఇందులో కొంతమేర కనిపిస్తాయి. సతీశ్ వేగేశ్న ఇంతకుముందు తీసిన ‘శతమానం భవతి’ వినోదం పంచుతూనే సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేస్తే.. ఈసారి సందేశమే ప్రధానంగా మారి.. వినోదం బ్యాక్ సీట్ తీసుకుంది. కుటుంబ ప్రేక్షకులకు కనెక్టయ్యే అంశాలు ఇందులో ఉన్నప్పటికీ.. ప్రేక్షకులకు వినోదం పంచడం అనే ప్రాథమిక విషయాన్ని మరిచిపోయి.. పెళ్లి గురించి.. మన సంప్రదాయాల గురించి వాళ్లకు అదే పనిగా క్లాస్ పీకుతున్న భావన కలిగిస్తుంది ‘శ్రీనివాస కళ్యాణం’ చూస్తుంటే.

‘శ్రీనివాస కళ్యాణం’ మంచి ఉద్దేశంతో తీసిన సినిమానే. పెళ్లి అనేది ఈ రోజుల్లో ఒక ఈవెంట్ లాగా మారిపోతోందని.. అందులో ఉన్న మాధుర్యాన్ని.. అనుభూతుల్ని ఈ తరం ఆస్వాదించలేకపోతోందని చర్చిస్తూ.. పెళ్లి గొప్పదనాన్ని చాటిచెప్పేందుకు చేసిన ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యే పాయింట్ తీసుకున్నాడు సతీశ్ వేగేశ్న. వాళ్లను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. సినిమా అంతా కూడా బోలెండంత మంది జనాలతో.. సందడి సందడిగా ఉంటూ.. మానవ సంబంధాలు.. మన సంప్రదాయాలు.. పెళ్లి గురించి మంచి విషయాలు చెబుతూ సాగిపోతుంది. ఐతే సినిమాలో చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించాలి కానీ.. అదే పనిగా డైలాగుల రూపంలో చెప్పడానికి ప్రయత్నించడంతోనే వచ్చింది సమస్య. రెండున్నర గంటల సినిమాలో సగం దాకా డైలాగులే నిండిపోయాయి. అందులో సగానికి పైగా డైలాగులు పెళ్లి గొప్పదనాన్ని చెబుతూ క్లాస్ పీకడానికే కేటాయించారు.

విశ్లేష‌ణ‌:
సంప్ర‌దాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రికీ ఉంది. ఇదే కాన్సెప్ట్‌తో మ‌న సంప్ర‌దాయంలో ముఖ్య‌మై ఘ‌ట్ట‌మైన పెళ్లి అనే అంశం చుట్టూ ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న అల్లుకున్న క‌థే `శ్రీనివాస క‌ళ్యాణం`. శ‌త‌మానం భ‌వ‌తి అనే చిత్రంతో విజ‌యాన్ని అందుకున్న ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న.. రాసుకున్న క‌థ ఇది. ఇందులో ఇద్ద‌రు మ‌నుషుల‌ను, రెండు కుటుంబాల‌ను ఒక్క‌టి చేసే పెళ్లి గురించి ఏదో చెప్పాయాల‌ని చెప్పేయ‌కుండా.. ఎలా జ‌రిపిస్తారు. పెళ్లి కూతురు తండ్రి ఏం చేయాలి.. పెళ్లికొడుకు కుటుంబ స‌భ్యులు ఏం చేస్తారు? ఇలా అన్ని విష‌యాల‌ను చ‌క్క‌గా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ప్ర‌స్తుతం యూత్ మ‌నోభావాలకు.. ఈ సినిమా కనెక్ట్ అవుతుందా? అనే అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. సినిమా క‌నెక్ట్ కావ‌డం క‌ష్టమే అనిపిస్తుంది. ఇక పాత్ర‌లు, వాటిని మ‌లిచిన తీరు, వాటి మ‌ధ్య భావోద్వేగాలు ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. నితిన్‌, రాశీఖ‌న్నా పాత్ర‌లు జ‌స్ట్ ఓకే. లుక్ ప‌రంగా ఇద్ద‌రి జంట తెర‌పై చూడ‌టానికి చ‌క్క‌గా ఉంది. ఇక మిల‌య‌నీర్‌గా న‌టించిన ప్ర‌కాశ్‌రాజ్ .. పాత్ర‌ను సునాయ‌సంగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నితిన్, ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్య న‌డిచే ఎమోష‌న‌ల్ సీన్‌లో నితిన్ డైలాగ్స్ వివ‌ర‌ణ మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపించేస్తుంది. నందితా శ్వేతా, జ‌య‌సుధ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌భాస్ శ్రీను, సితార‌, ఆమ‌ని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. పాత్ర‌ధారులు కంటే పాత్ర‌లను స‌రిగా డిజైన్ చేయ‌క‌పోవ‌డం అనేది సినిమాలో ఫీల్‌ను క్యారీ చేయ‌దు. హీరో హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు, స‌త్యం రాజేశ్‌, హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, విద్యుల్లేఖ ఇలా అన్ని పాత్ర‌ల మ‌ధ్య స‌న్నివేశాలు ఏదో ర‌న్ అవుతున్నాయంటే.. ర‌న్ అవుతున్నాయ‌నేలా ఉంటాయి. ఇక సాంకేతికంగా చూస్తే.. పాట‌లు స‌రిగ్గా ఆన‌వు కానీ.. నేప‌థ్య సంగీతం బాగుంది. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది. పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే కీల‌క సిచ్యువేష‌న్స్‌లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

సాంకేతిక విభాగం :

సతీష్ వేగేశ్న రచయితగా దర్శకుడిగా ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రానికి దాదాపుగా పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద కూడా ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. పాటల్లో తెలుగుద‌నం కనిపిస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆయన అద్భుతంగా విజువ‌లైజ్ చేసి తీశారు.

ఇక మధు ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో ఆయన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని దిల్ రాజు నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

విడుదల తేదీ : ఆగష్టు 9, 2018
 రేటింగ్ : 2.5/5

నటీనటులు : నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్

దర్శకత్వం : విగ్నేష సతీష్

నిర్మాతలు : దిల్ రాజు

సంగీతం : మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

రచన, స్క్రీన్ ప్లే : విగ్నేష సతీష్

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *