ఇంకా భర్తీ కానీ ఎంబీబీఎస్, డెంటల్ సీట్లు…

మొదటి విడత కౌన్సెలింగ్ లో ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో  మొత్తం 2,300 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు, 590 డెంటల్ కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గడువు ముగిసిన సోమవారానికి కాలేజీల్లో చేరికలు పూర్తయ్యాయి. ఇంకా 220 ఎంబిబిఎస్ సీట్లు 170 డెంటల్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకరన్  చెప్పినట్టు సమాచారం. చాలామంది జాతీయ స్థాయి మెడికల్ కాలేజీలపై ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అన్ రిజర్వుడు సీట్లలో చాలామంది చేరలేదని, మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, దీని మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. ఈడబ్లూఎస్, ప్రత్యేక కేటగిరి రిజర్వేషన్ల అమలుకు కన్వినర్ కోటలో 500న ఎంబిబిఎస్ పక్కన పెట్టి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ కాలేజిల్లో 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం 190 సీట్లను అదనంగా పెంచిన విషయం తెలిసిందే, కానీ ప్రైవేట్ కాలేజీల్లో పెంపుపై మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా నిర్ణయం ప్రకటించలేదు.  దీనివల్ల ఈడబ్లూఎస్ ఖరారైన ప్రభుత్వ సీట్లకు, ఖరారు కానీ ప్రైవేటు సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. తోలి విడత పూర్తయి రెండో విడత కౌన్సెలింగ్ కు వెళ్తున్నా ఈడబ్లూఎస్ పై స్పష్టత లేక ఆందోళన నెలకొంది. వైద్య విద్య డైరెక్టర్ తో నిర్వహించిన భేటీలో ఎంసిఐ స్పష్టత లేదు. ఈ సారి కన్వినర్ కోటాలో సీట్లు ఉండకపోవచ్చని అభిప్రాయం వున్నా, ఎంసిఐ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఏమి చేయలేమని వర్సిటి వర్గాలు చెప్తున్నాయి.

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తీ చేయాలంటే ముందుగా కన్వినర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తీ అవ్వాలని కరుణాకర్ రెడ్డి తెలిపారు. రెండో విడత పూర్తీ అయ్యాక మూడో విడతకు వెళ్తామన్నారు. అప్పటికి కేంద్రం లో రెండో విడత కౌన్సెలింగ్ పూర్తీ అవుతుంది. అక్కడ మిగిలిన సీట్లను కేంద్రం ఆయా రాష్ట్రాలకు వెనక్కి ఇస్తుంది. దీనివల్ల మరికొన్ని ప్రభుత్వ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *